Fire Accident At Madhapur : హైదరాబాద్ మాదాపూర్లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని సత్వ భవనంలో మంటలు ఈ రోజు (శనివారం) ఉదయం మంటలు చెలరేగాయి. సత్వ ఎలిక్విర్ భవనంలోని ఐదో అంతస్తులో ఈ ఘటన చోటు చేసుకుంది. క్రమంగా అని నాలుగో అంతస్తుకు వ్యాపించాయి. ఒక్కసారిగా భారీ శబ్ధం రావడం, మంటలు చెలరేగడంతో స్థానికలు భయాందోళనకు గురయ్యారు.
వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. ప్రమాదం సంభవించిన పక్క భవనంలోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను అధికారులు బయటకు పంపించేశారు. గ్యాస్ సిలిండర్లు పేలడంతో సమీప భవనాలు సైతం పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఘటనలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు గుర్తించారు. మూడు అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పివేశారు.
ప్రైవేట్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం- చిన్నారి సహా ఏడుగురు మృతి
అనకాపల్లిలో పేలుడు కలకలం - ముగ్గురికి తీవ్రగాయాలు - FIRE ACCIDENT AT Cement Bricks