CRPF Security to Razakar Producer : విడుదలకు ముందు వార్తల్లో నిలిచిన రజాకార్ సినిమా, విడుదలయ్యాక కూడా న్యూస్‌లో నిలుస్తోంది. తాజాగా రజాకార్ సినిమా(Razakar Movie) నిర్మాత గూడూరు నారాయణ రెడ్డికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఆయన కేంద్రహోంశాఖకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిఘా వర్గాల నివేదిక తర్వాత 1+1 సీఆర్పీఎఫ్ సిబ్బందిని కేటాయిస్తూ కేంద్ర హోం శాఖ అదేశాలు జారీ చేసింది. సినిమా విడదలకు ముందు నుంచి తన బెదిరింపులు వస్తున్నాయని మీడియాతో తెలియజేశారు. దాదాపు 1100 కాల్స్ వచ్చిన్నట్లు ఆయన అధికారులకు తెలిపారు.
రజాకార్ నిర్మాతకు బెదిరింపు కాల్స్ - సీఆర్పీఎఫ్ భద్రత కల్పించిన కేంద్రం - crpf security to Razakar producer - CRPF SECURITY TO RAZAKAR PRODUCER
CRPF Security to Razakar Producer : రజాకార్ సినిమా నిర్మాత గూడూరు నారాయణ రెడ్డికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కేంద్రహోంశాఖకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిఘా వర్గాల నివేదిక తర్వాత 1+1 సీఆర్పీఎఫ్ సిబ్బందిని కేటాయిస్తూ కేంద్ర హోంశాఖ అదేశాలు జారీ చేసింది.
CRPF Security to Razakar Producer
Published : Mar 21, 2024, 8:08 PM IST
నిజాం ప్రభువు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన తెలంగాణ సాయుధ పోరట నేపథ్యంలో తెరకెక్కిందే 'రజాకార్' సినిమా. అనేక వివాదాలు దాటుకొని ఈ సినిమా మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రజాకార్ సినిమాను గూడూరి నారాయణరెడ్డి నిర్మించగా, సత్యనారాయణ దర్శకత్వం వహించారు. బాబీ సింహా, వేదిక, అనసూయ తదితరులు నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.