Crops Damaged By Heavy Rains And Krishna River Floods in AP : వరి, పత్తి, అరటి, కంద, పసుపు ఇలా పంట ఏదైతేనేం ప్రకృతి ప్రకోపానికి బలయ్యాయి. కృష్ణమ్మ వరద ఉద్ధృతికి ఎన్నడూ లేని విధంగా తీర ప్రాంత రైతులు నష్టపోయారు. వరదల సమయంలో పంట పొలాల్లో ఎటు చూసినా నీరు మాత్రమే కనిపించింది. ఇప్పుడు రైతులను ఎవరిని కదిలించినా వారి కంటకన్నీరు ఒలుకుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లా కృష్ణానది పరిధిలో 25 లంక గ్రామాలున్నాయి. తుళ్లూరు, తాడేపల్లి, దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలోని ఈ లంక గ్రామాల్లో పంటలన్నీ కృష్ణమ్మ తన వెంట తీసుకుపోయింది. ఎకరాకు 50 వేల నుంచి లక్ష వరకూ పెట్టుబడులు పెట్టారు. అవన్నీ నీటిపాలవడంతో ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే చేయూత అందించాలని రైతులు కోరుతున్నారు.
వేల హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు :రైతులకు జరిగిన నష్టాన్ని తెలుసుకునేందుకు అధికారులు పంట పొలాల్ని పరిశీలించారు. నష్ట వివరాలతో నివేదిక రూపొందించారు. భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇటీవల కేంద్ర బృందం పర్యటించింది. ఏ విధంగా నష్టపోయిందీ కేంద్ర బృందానికి రైతులు వివరించారు. గుంటూరు జిల్లాలో 29,882 హెక్టార్లలో వరి 2,430 హెక్టార్లలో పత్తి, 688.6 హెక్టార్లలో మినుము, ఇతర పంటలు మొత్తం 33,210.6 హెక్టార్లలో పంటలు నీట మునిగి 49,961 మంది రైతులకు నష్టం వాటిల్లింది. 4,058.86 హెక్టార్లలో ఉద్యాన పంటలు, కూరగాయ పంటలు నీటమునగటంతో 6,030 మంది రైతులు నష్టపోయారు.
కనుమరుగవుతున్న ఆ గ్రామం.. - Old Edlanka Submerged to Krishna