ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం భద్రత కోసం విద్యుత్ తొలగించాం- బలంగా రాయి విసిరినట్లు తెలుస్తోంది: సీపీ కాంతి రాణా - Stone Attack on CM Jagan - STONE ATTACK ON CM JAGAN

CP Kanti Rana Tata revealed key facts: సీఎం జగన్ పై రాయిదాడి ఘటనలో విచారణ వేగంగా కొనసాగుతుందని విజయవాడ సీపీ కాంతి రాణా టాటా తెలిపారు. వెలంపల్లి శ్రీనివాస్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీపీ వెల్లడించారు. రూఫ్‌టాప్‌కు విద్యుత్‌ వైర్లు తగులుతాయని విద్యుత్‌ నిలిపివేసినట్లు తెలిపారు. సీఎం భద్రతకోసం అన్ని చర్యలు తీసుకున్నామని కాంతి రాణా పేర్కొన్నారు.

CP Kanti Rana Tata revealed key facts
CP Kanti Rana Tata revealed key facts

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 15, 2024, 7:44 PM IST

CP Kanti Rana Tata revealed key facts:రాత్రి 8.04 గం.కు వివేకానంద స్కూల్‌ వద్ద ఒక వ్యక్తి రాయి విసిరాడని సీపీ క్రాంతి రాణా వెల్లడించారు. ఆ ప్రాంతంలోని 24 సీసీ టీవీ ఫుటేజీలు, సెల్‌ఫోన్‌ రికార్డింగ్‌లు పరిశీలించామన్నారు. ఒక వ్యక్తి బలంగా రాయి విసిరాడు. అది సీఎం నుదుటికి తగిలింది, రాయి సీఎం నుదుటికి తగిలి పక్కనే ఉన్న వెలంపల్లిపై పడిందని సీపీ తెలిపారు. వెలంపల్లి శ్రీనివాస్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీపీ వెల్లడించారు. దర్యాప్తు వేగంగా సాగుతోంది.. అతి త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామన్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఐదారు వేల మంది ఉన్నారని, దాడి జరిగిన ప్రాంతంలో క్లూస్‌ టీమ్‌ కొన్ని రాళ్లు సేకరించారని వెల్లడించారు. రాయి దాడి చేతితోనే జరిగిందని భావిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. అరచేతిలో పట్టేంత రాయి విసిరినట్టు వీడియో ఫుటేజ్‌ను పరిశీలిస్తే అర్థమవుతోందన్నారు.

కరెంట్‌ ఎందుకు లేదని మీడియాలో ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయని సీపీ క్రాంతి రాణా పేర్కొన్నారు. యాత్ర జరిగిన మార్గంలో ఎక్కువగా వివిధ రకాల లైన్లు ఉన్నాయని, ఎన్నికల ప్రచారానికి అన్ని రకాల తీగలు తొలగించటం కుదరదని తెలిపారు. రూఫ్‌టాప్‌ ఎత్తు ఎక్కువగా ఉన్నప్పుడు విద్యుత్‌ నిలిపివేయటం సర్వసాధారణమని వెల్లడించారు. రూఫ్‌టాప్‌కు విద్యుత్‌ వైర్లు తగులుతాయని విద్యుత్‌ నిలిపివేయటం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి భద్రత కోసమే ఇలా కరెంట్ తీసేశామని తెలిపారు. కరెంట్‌ తీయడం అనేది సెక్యూరిటీ ప్రోటోకాల్‌లో భాగమే అని సీపీ వెల్లడించారు. 24 సీసీ కెమెరాల ఫుటేజ్‌, సెల్‌ఫోన్‌ రికార్డింగ్‌లు పరిశీలించినట్లు తెలిపారు. సభ ఫుటేజ్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామన్నారు.


సీఎం జగన్​పై దాడి కేసులో అధికారుల పాత్రపై విచారించాలి : పవన్ కల్యాణ్ - pawan kalyan on cm ys jagan attack

చీకట్లో గుంపు బాగా ఉండటం చూసుకుని దుండగుడు రాయి విసిరాడని సీపీ వెల్లడించారు. అజిత్‌సింగ్‌నగర్‌లో రాయి దాడి జరిగినట్లు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కోసం 8 బృందాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సీసీటీవీల కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కొందరు సెల్‌ఫోన్లలో రికార్డు చేసిన దృశ్యాలను కూడా నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. స్కూల్‌ భవనంలో ఉన్నట్లు భావిస్తున్న 40, 50 మందిని ప్రశ్నించినట్లు వెల్లడించారు. ఒక వ్యక్తి రాయి విసిరాడు అనేది స్పష్టంగా తెలుస్తోందని పేర్కొన్నారు. ఎయిర్‌గన్‌తో కొట్టాడా, చేతితో విసిరాడా అనేది తెలియాల్సి ఉందన్నారు. ఆకతాయితనంగా విసిరాడా, ఉద్దేశపూర్వకంగా వేశాడా అనేది తేలాలన్నారు. నిందితుడు రాయిని బలంగానే విసిరాడు, సున్నితమైన చోట తగిలి ఉంటే తీవ్ర ప్రమాదం ఉండేదని సీపీ పేర్కొన్నారు.


నిందితుల వివరాలు చెబితే పారితోషికం - సీఎం జగన్​పై దాడి కేసులో సీపీ ప్రకటన - CM JAGAN CASE

ABOUT THE AUTHOR

...view details