Court Remand to Kodali Nani Follower Kali:వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు, కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమాల కాళీకి న్యాయస్థానం రిమాండ్ విధించింది. గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కాళీని గుడివాడ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. ఈ నెల 10 వరకు కాళీకి న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఆ తర్వాత నిందితుడు పోలీసులు కాళీని నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు.
వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా గుడివాడ టీడీపీ కార్యాలయం, పార్టీ నేత రావి వెంకటేశ్వరరావుపై దాడి కేసులో కాళీది కీలక పాత్ర. 2022 డిసెంబరు 25న కాళీ తన అనుచరులతో కలిసి టీడీపీ కార్యాలయం, వెంకటేశ్వరరావుపై పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేశాడు. ఈ ఘటనపై వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేసినా అప్పటి అధికార పార్టీ అండతో నిందితులను అరెస్టు చేయలేదు. పైగా రావి వర్గీయులు, ఇతర టీడీపీ నాయకులపై పోలీసులు ఎదురు కేసులు నమోదు చేశారు.
ఇది వైఎస్సార్సీపీ రాజ్యం అనుకుంటున్నారా? - తోలు తీసి కూర్చోపెడతా ఖబడ్దార్ : పవన్ కల్యాణ్