Heavy Rains in Sri Sathya Sai District :శ్రీ సత్యసాయి రాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. గోరంట్ల మండలం దిగువ గంగంపల్లి తండాలో పిడుగుపడి దంపతులు సహా 2 పాడి ఆవులు మృతి చెందాయి. ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఉదయం కురిసిన భారీ వర్షానికి ఒకే కుటుంబానికి చెందిన దసరా నాయక్, దేవిబాయి మృతి చెందగా వారి కుమారుడు జగదీశ్ నాయక్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రున్ని పుట్టపర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ప్రభుత్వం తరఫున దంపతులిద్దరికి 8 లక్షలు :పశువులపాకలో ఉండగా పిడుగుపాటుకు గురైనట్లు బాధితుడు తెలిపాడు. ఘటనపై మంత్రి సవిత స్పందించారు. బాధితునికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం తరఫున దంపతులిద్దరికి 8 లక్షలు, 2 ఆవులకు కలిపి 70 వేలు నష్ట పరిహారం చెల్లిస్తామని తెలిపారు.
రాత్రి నుంచి పిడుగులతో పాటు వర్షం :పుట్టపర్తిలో రాత్రి కురిసిన వర్షానికి రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రసిద్ధ దేవాలయమైన సత్యమ్మ దేవాలయం చుట్టూ భారీగా వర్షపు నీరు చేరింది. ఆలయానికి వెళ్లడానికి దారి లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి నుంచి పిడుగులతో పాటు వర్షం కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. డ్రైనేజీలన్నీ మురుగు నీటితో నిండిపోయి రోడ్డుపైకి పొర్లుతున్నాయి. దీంతో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయి.
60 ఏళ్లలో చూడని ప్రళయం - వర్షం ధాటికి కొండలు కరిగి ఊర్లనే మింగేసింది - Tribes Problems on Rains