Couple Died Suspiciously In Sircilla : రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ శివారులోని వ్యవసాయ పొలాల వద్ద దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందారు. జిల్లా కేంద్రంలోని శాంతి నగర్‌కు చెందిన ముదాం వెంకటేష్ (40), వసంత (36) భార్యాభర్తలు. వీరికి ఒకటవ తరగతి చదువుతున్న కుమార్తె (వర్షిణి), 7వ తరగతి చదువుతున్న కుమారుడు (అజిత్) ఉన్నారు. భర్త, భార్యను కట్టెతో కొట్టి అనంతరం పురుగుల మందు తాగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలతోనే ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఘటనా స్థలంలో పురుగుల మందు డబ్బా, కట్టెకు రక్తపు మరకలు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కట్టెకు రక్తపు మరకలు - పక్కనే పురుగుల మందు డబ్బా - దంపతుల అనుమానాస్పద మృతి - COUPLE DIED SUSPICIOUSLY SIRCILLA
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ శివారులోని వ్యవసాయ పొలాల వద్ద దంపతుల అనుమానాస్పద మృతి - ఘటనా స్థలంలో పురుగుల మందు డబ్బాలు, కట్టెకు రక్తపు మరకలు గుర్తించిన పోలీసులు
![కట్టెకు రక్తపు మరకలు - పక్కనే పురుగుల మందు డబ్బా - దంపతుల అనుమానాస్పద మృతి Couple Died Suspiciously](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-11-2024/1200-675-22896050-thumbnail-16x9-died.jpg)
Published : Nov 14, 2024, 12:36 PM IST
|Updated : Nov 14, 2024, 2:23 PM IST
నడిరోడ్డుపై తల్లీకుమారుడి హత్య : మరోవైపు సంగారెడ్డి జిల్లా బొంతపల్లిలో నడిరోడ్డుపై తల్లీకుమారుడి హత్య కలకలం రేపింది. గుమ్మడిదల మండలం బొంతపల్లిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సరోజ దేవి, ఆమె కుమారుడు అనిల్‌లను బిహార్‌కు చెందిన నాగరాజు నడిరోడ్డుపై అతి దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. నాగరాజు రెండేళ్ల కుమారుడు కొన్ని రోజుల క్రితం చనిపోయాడని, దీనికి కారణం ఆ తల్లీకుమారులే అని, మళ్లీ తన భార్యపై దాడికి వచ్చారని అందుకే ఈ హత్య చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.