తెలంగాణ

telangana

ETV Bharat / state

లెక్కలతో లెక్కకు మించిన కొత్త కెరియర్లు - గణితంతో మిళితమైతే ఎన్నో అవకాశాలు !

ఏఐ, డేటా సంబంధిత విభాగాల్లో జాబ్స్​ ఉండగా కొత్తగా గణితంతో మిళితమై అవకాశాలు తెరుస్తున్నాయి కొన్ని కెరియర్లు - అల్గారిథమిక్‌ ట్రేడర్‌, అటానమస్‌ వెహికల్‌ సిస్టమ్‌ అనలిస్ట్‌ వంటి లెక్కకు మించి కొత్త కెరియర్లు

ALGORITHM TRADER COURSES
New Careers with Machine Learning Courses (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

New Careers with Maths: ఎటుచూసినా ఐటీ పరుగులు. ఈ నేపథ్యంలో మనల్ని మనమే కొత్త కొత్త నైపుణ్యాలతో ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉండాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో గణితంతో మిళితమై అదే సమయంలో కొత్త మార్కెట్​ మార్పులతో నూతన అవకాశాలు తెస్తున్నాయి కొన్ని కెరియర్లు. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందామా. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), డేటా సంబంధిత విభాగాలు జాబ్‌ మార్కెట్‌లో రాజ్యమేలుతున్న సమయంలో గణిత పరిజ్ఞానం ఓ కీలకమైన నైపుణ్యంగా మారింది. ఏఐ నుంచి మెషిన్‌ లెర్నింగ్‌ వరకూ, ఆర్థిక విపణి నుంచి సొంతంగా నడిచే వాహనాల వరకు వివిధ రకాలుగా గణితశాస్త్ర థియరీలు ఆవిష్కరణలకు తోడ్పతుతున్నాయి. ఇలా కొన్ని కొత్తగా కెరియర్లు సైతం రూపొందుతున్నాయి.

అల్గారిథమిక్‌ ట్రేడర్‌ :సాధారణంగా స్టాక్‌మార్కెట్‌ ట్రేడింగ్‌ అంటే అందరికీ తెలిసిందే. అల్గారిథమిక్‌ ట్రేడింగ్‌ ఆర్థిక రంగాన్ని చాలా ప్రభావితం చేస్తోంది. పటిష్ఠమైన గణిత విధానాలు, కంప్యూటర్‌ అల్గారిథమ్స్‌ను ట్రేడింగ్‌లో వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్​ హెచ్చుతగ్గులకు లెక్కప్రకారం ముందుగానే పసిగట్టగలవు. మిల్లీసెకన్ల వ్యవధిలో వాటికి గురించి తెలియజేస్తుంది. ముందుగా నిర్దేశించిన నియమాలకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకునేలా ఈ అల్గారిథమిక్‌ ట్రేడింగ్‌ ఉంటుంది. అనుకూల పరిస్థితులు ఎదురైనప్పుడు ట్రేడ్‌ను ఎగ్జిక్యూట్‌ చేస్తుంది. సాధారణంగా ట్రేడర్లు సెంటిమెంట్లు, ఆవేశంతో నిర్ణయాలకు తీసుకుంటారు.

కానీ అల్గారిథమిక్‌ ట్రేడింగ్‌ ముందుగా నిర్ణయించుకున్న నియమాలకు కట్టుబడి ఉంటుంది. ఎటువంటి భావోద్వేగాలకూ లోనుకాని ట్రేడింగ్‌ దీని ద్వారా సాధ్యం. అయితే ఈ కెరియర్​కు గణితంతో పాటు ఆర్థిక శాస్త్రాల లోతైన అవగాహన ఉండాలి. వివిధ పరిస్థితుల్లో మార్కెట్​ గురించి అంచనా వేసేలా అనుభవం సంపాదించాలి. అల్గారిథమిక్‌ ట్రేడర్లు అడ్వాన్స్‌డ్‌ కాలిక్యులస్, స్టాటిస్టిక్స్‌ ఉపయోగిస్తారు. ప్రాబబిలిటీ, రిస్క్‌ అనాలిసిస్‌ వంటి వివిధ గణిత పద్ధతులను సైతం అనుసరించి పని చేస్తారు. అందువల్ల వీటిపై పట్టు సాధించాలి.

అటానమస్‌ వెహికల్‌ సిస్టమ్‌ అనలిస్ట్‌ :మానవ సహాయం లేకుండా తమంతట తాముగా నడిచే వాహనాలను అటానమస్‌ వెహికల్స్‌ అంటారు. ఇప్పటికే చోదకుడి అవసరం లేకుండా వాహనాలే సొంతంగా చూసి, నిర్ణయాలు తీసుకునేలా తయారు చేస్తున్నారు. ఇది కంప్యూటర్‌ సైన్స్, గణితం, ఇంజినీరింగ్‌ వంటి వివిధ సబ్జెక్టుల సంక్లిష్ట కలయిక. లీనియర్‌ ఆల్జీబ్రా, డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్‌ వంటి వాటితో ఈ మోడల్స్‌ను రూపొందిస్తారు. ఇందులో అంచనా వేసి నిర్ణయాలు తీసుకోగలిగేలా చేయడంతో గణితం కీలక పాత్ర పోషిస్తుంది. అదే సమయంలో మెషిన్‌ లెర్నింగ్‌ మెలకువలను సైతం ఉపయోగిస్తారు. ఇందుకు గణాంక విశ్లేషణ, ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు అవసరం అవుతాయి.

  • మెకానికల్‌ - కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్ చేసినవారు అధికంగా ఈ కెరియర్​లోకి వస్తున్నారు. అంతేకాకుండా రోజువారీ పని సాఫీగా సాగేలా కంట్రోల్‌ సిస్టమ్‌, రోబోటిక్స్ గురించి కనీస అవగాహన అవసరం.
  • అంతేకాకుండా డీబగ్గింగ్, టెస్టింగ్, కొలాబరేషన్‌, డేటా అనాలిసిస్ వంటివి ఇంకా ఎన్నో చేస్తారు. చదువు పూర్తయిన వెంటనే ఇంటర్న్‌షిప్‌లు లేదా ప్రాజెక్టుల ద్వారా ఈ రంగంలో అనుభవం సంపాదించుకోవచ్చు.

క్రిప్టో కరెన్సీ అనలిస్ట్‌ :ప్రస్తుతం అనేక డిజిటల్​ కరెన్సీలు ఉన్నాయి. నిపుణులు వీటి స్థిరత్వం మార్కెట్‌ పరిస్థితులను అంచనా వేస్తూ పెట్టుబడి వ్యూహాలపై మదుపరులు, సంస్థలకు సలహాలు ఇస్తుంటారు. అందుకు వీరు స్టాటిస్టికల్‌, ప్రాబబిలిటీ సూచనలను వాడతారు. మోడలింగ్‌ను ఉపయోగించి విపణి తీరుతెన్నులను అధ్యయనం చేస్తారు. ఎకనమిక్స్‌, ఫైనాన్స్ లేదా బిజినెస్‌లలో ఏదైనా డిగ్రీ ఉంటే ఇందులో రాణించవచ్చు. ఆర్థిక రంగంలో అనుభవంతో పాటు డేటా అనాలిసిస్​ మీద పట్టు ఉండాలి.

ఏఐ ఎథిక్స్‌ ఆఫీసర్‌ :ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఎథిక్స్‌ ఆఫీసర్లుగా తాము పని చేస్తున్న ఏఐ సిస్టమ్స్‌ సగటు విలువలకు తగిన విధంగా, పద్ధతులు, కట్టుబాట్లు పాటించేలా జాగ్రత్త తీసుకుంటారు. అల్గారిథమ్స్‌లో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా వాటిని గుర్తించేలా గణితాన్ని ఉపయోగిస్తున్నారు. మెషిన్​ తీసుకునే నిర్ణయాల్లో ఎటువంటి వివక్షలు రాకుండా ఇది వాడతారు. ఎథికల్‌ అల్గారిథమ్స్‌, స్టాటిస్టికల్‌ మోడల్స్ ఉపయోగించి ఈ వివక్షలను నివారిస్తారు. ఏఐ పద్ధతులను తీరైన రీతిలో పెట్టేందుకు మ్యాథమెటికల్‌ రీజనింగ్‌ను ఉపయోగిస్తారు. డేటా సంరక్షణ, గోప్యత కోసం సైతం ఇది ఉపయోగపడుుతుంది. ఈ రంగంలోకి రావాలనుకునే వారు మెషిన్‌ లెర్నింగ్​తోపాటు డేటాసైన్స్‌, కంప్యూటర్‌ విజన్, నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్, ఇలాంటి ఇతర సబ్జెక్టుల మీద కనీస అవగాహన ఉండటం ఉపకరిస్తుంది.

ఈ ఐదు AI కోర్సులు చేస్తే చాలు - లక్షల్లో సాలరీ గ్యారెంటీ! - High Paying AI Jobs

ABOUT THE AUTHOR

...view details