ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

4 కంటైనర్లలో రూ.2 వేల కోట్లు తరలింపు - Rs 2000 crore - RS 2000 CRORE

Rs 2000 crore: అనంతపురం జిల్లాలో 4 కంటైనర్లలో రూ.2 వేల కోట్ల కరెన్సీ నోట్లను పోలీసులు పట్టుకున్నారు. 4 కంటైనర్లను తనిఖీ చేయగా వాటిలో రూ.500 నోట్లు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వాటి విలువ సుమారు 2 వేల కోట్లు ఉంటుందని సమాచారం. అయితే, ఆ కంటైనర్లు ఆర్బీఐకి చెందినవిగా అధికారులు వెల్లడించారు.

Container lorrys carrying Rs 2000 crore
Container lorrys carrying Rs 2000 crore

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 2, 2024, 2:50 PM IST

Updated : May 2, 2024, 3:30 PM IST

Rs 2000 crore: అనంతపురం జిల్లాలో 4 కంటైనర్లలో తరలిస్తున్న రూ.2 వేల కోట్ల కరెన్సీ నోట్లను పోలీసులు పట్టుకున్నారు. 4 కంటైనర్లను తనిఖీ చేయగా వాటిలో రూ.500 నోట్లు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వాటి విలువ సుమారు 2 వేల కోట్లు ఉంటుందని సమాచారం. అయితే, ఆ కంటైనర్లు ఆర్బీఐకి చెందినవిగా అధికారులు వెల్లడించారు.

అనంతపురం జిల్లాలో డబ్బు కంటైనర్లు కలకలం రేపాయి. నాలుగు కంటైనర్లలో 2000 కోట్ల రూపాయలు వెళ్తున్నాయి. ఎన్నికల తనిఖీల్లో భాగంగా గజరాంపల్లి వద్ద పోలీసలు వాహనాలను తనిఖీ చేశారు. నాలుగు కంటైనర్లలో సుమారు రూ. 2000 వేల కోట్లు ఉన్నట్లు గుర్తించారు. కంటైనర్​తో పాటుగా వస్తున్న సిబ్బందిని ప్రశ్నించగా, ఈ డబ్బులు ఆర్బీఐకి చెందినవిగా తెలిపారు. ఆర్బీఐ ఆదేశాల మేరకే వెళుతున్నట్టు పేర్కొన్నారు.

4 కంటైనర్లలో రూ.2 వేల కోట్లు తరలింపు

ఎన్నికల తనిఖీల్లో భాగంగా అనంతపురం జిల్లా జాతీయ రహదారిపై పామిడి సీఐ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. పోలీసు స్టికరింగ్​తో వెళ్తున్న నాలుగు కంటైనర్లను గుర్తించిన పోలీసులు అనుమానం వచ్చి, వాటిని ఆపారు. కంటైనర్​తో వస్తున్న సిబ్బందిని ప్రశ్నించగా, నాలుగు కంటైనర్లలో రూ. 2000 వేల కోట్లు ఉన్నట్లు చెప్పారు. ఇంత పెద్ద మొత్తంలో నగదు తరలిస్తుండటంతో వెంటనే స్థానిక పోలీసులు, జిల్లా కలెక్టర్​తో పాటుగా ఎన్నికల అధికారులు, ఇన్​కమ్ ట్యాక్స్ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అధికారులు డబ్బు కేరళ రాష్ట్రంలోని కొచ్చి ఆర్బీఐ నుంచి హైదరాబాద్​లోని ఆర్బీఐకి వెళ్తున్నట్లుగా గుర్తించారు. ఇందులో రూ. 500 కోట్లు ఐసీఐసీఐ బ్యాంకు, 500 కోట్లు ఐడీబీఐ బ్యాంక్ మరో వెయ్యి కోట్లు ఫెడరల్ బ్యాంకుకు చెందినవిగా పోలీసులు గుర్తించారు. ఈ మొత్తం డబ్బుకు సంబంధించి సరైన పత్రాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ ఉత్తర్వులతో వెళుతున్నట్లు రికార్డులు పరిశీలించి, తిరిగి ఆ కంటైనర్లను వదిలేశారు.


బాగా డబ్బులు సంపాదించాలా? ఈ 'చక్రవడ్డీ' లెక్కలు తెలుసుకోండి! - POWER OF COMPOUNDING

' అనంతపురం జిల్లా పామిడి వద్ద 4 కంటైనర్లలో కరెన్సీని గుర్తించాం. ఒక్కో కంటైనర్ లో రూ. 5వందల కోట్లు ఉన్నట్టుగా గుర్తించాం. నాలుగు కంటైనర్లలో రూ. 2వేల కోట్లు ఉన్నాయన్నాయి. పూర్తి రికార్డులు పరిశీలించాం. పై అధికారులకు సమాచారం ఇచ్చాం. కొచ్చి ఆర్బీఐ నుంచి హైదరాబాద్ ఆర్బీఐకీ కంటైనర్లు వెళ్తున్నాయన్నాయి. ఈ డబ్బులు ఆర్​బిఐకి చెందినవి అందుకు సంబంధించి పూర్తి పత్రాలు ఉన్నాయి. సరైన పత్రాలు ఉండటంతో ఆ కంటైనర్లను వదిలిపెట్టాం. పామిడి, సీఐ

ఉత్తరాంధ్రలో మంత్రులు గెలవడం కష్టమే - పోటీని తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి - tough situation for ministers

Last Updated : May 2, 2024, 3:30 PM IST

ABOUT THE AUTHOR

...view details