Congress will Make Key Announcement in Tirupati Sabha:జగన్, చంద్రబాబులు బీజేపీకి వంగివంగి సలాములు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల రెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా అనే వరాన్ని ఇద్దరూ బీజేపీకి తాకట్టు పెట్టారన్నారు. వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం ఏపీకి ప్రత్యేక హోదా రాదని అన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేత లాంటి నిర్ణయాలు అమలు కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు.
జగన్ బీజేపీతో ఉన్నారు: జగన్ పార్టీ మైనింగ్, లిక్కర్, ఇసుక మాఫియా చేస్తోందని తెలిసి బీజేపీ ఎందుకు మౌనంగా ఉండిపోయిందని ప్రశ్నించారు. ఏపీలో అవినీతి ఉన్నా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. జగన్ బీజేపీతో ఉన్నారని అనడానికి చర్యలు లేకపోవడమే సాక్ష్యమని షర్మిలరెడ్డి తెలిపారు. ఉద్యోగాలు దొరక్క యువత పొరుగు రాష్ట్రాలు వెళ్తున్నారన్నారు. యువత లేని రాష్ట్రంగా ఏపీ తయారు అవుతుందన్నారు. మెగా డీఎస్సీ అని దగా చేశారు, జాబ్ కేలండర్ అని జగన్ యువతను మోసం చేశారన్నారు.
వైఎస్సార్సీపీ, టీడీపీలు ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టాయి: షర్మిల నిన్న ఫుల్ - నేడు నిల్ - కుప్పానికి హంద్రీనీవా జలాల 'సినిమా సెట్టింగ్'
ఏపీకి ప్రత్యేక హోదాపై డిక్లరేషన్: కుటుంబానికి ఐదు వేల రూపాయలు చొప్పున ప్రతీ నెలా ఇచ్చేలా ఓ పథకం కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇందిరమ్మ అభయం కింద మహిళల ఖాతాల్లోకి జమ చేసేలా ఈ పథకం రూప కల్పన చేశామని పీసీసి అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల రెడ్డి తెలిపారు. పెరిగిన ధరలు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ నేత వైఎస్ ఓ వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి చేసి చూపారని తెలిపారు. మార్చి 1వ తేదీన తిరుపతిలో బహిరంగ సభ ద్వారా ఏపీకి ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ చేస్తామని షర్మిల తెలిపారు.
మోదీ మాట ఇచ్చారు మర్చిపోయారు: అధికార పార్టీలు ప్రత్యేక హోదాపై మాటలు మాత్రమే చెప్పాయన్న ఆమె, 10 ఏళ్లు ఏపీకి ప్రత్యేక హోదా అని తిరుపతి సభలో మోదీ మాట ఇచ్చారు కానీ మర్చిపోయారన్నారు. అదే వేదికగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం బహిరంగ సభ ద్వారా డిక్లరేషన్ చేస్తామని వెల్లడించారు. చంద్రబాబు 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని అడిగితే 10 ఏళ్ల పాటు హోదా ఇస్తామని, ఏపీని హార్డ్ వేర్ హబ్‌గా, చమురు రిఫైనరీలు ఇస్తానని మోదీ చెప్పారు కానీ ఒక్కమాట కూడా నిలబెట్టు కోలేదని విమర్శించారు.
విభేదాలు పక్కనపెట్టి విజయానికి కృషి చేయండి- కష్టపడే ప్రతి ఒక్కరికీ అవకాశం: చంద్రబాబు
ఇద్దరూ బీజేపీకి సాగిల పడ్డారు: 10ఏళ్లుగా బీజేపీ ఏపీని మోసం చేసిందన్నారు. ఏపీలో పాలక పక్షం జగన్, ప్రతిపక్షం చంద్రబాబు ఇద్దరూ బీజేపీకి సాగిల పడ్డారన్నారు. ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలకు పరిశ్రమలు, ఉద్యోగాలు వచ్చాయని, మరి ఏపీకి ఏం వచ్చాయి, ఏపీలో కనీసం పది పరిశ్రమలు కూడా రాలేదని అన్నారు. ప్రత్యేక హోదా అనే చంద్రబాబు, జగన్ ఓట్లు దండుకున్నారని, హోదా కోసం రాజీనామాలు అని బీజేపీతో దోస్తీ చేశారని షర్మిల అన్నారు.