Conflict Between Adilabad Congress Leaders : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో అంతర్గత ముసలం కొనసాగుతోంది. బీఆర్ఎస్కు చెందిన పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత(MP Venkatesh Netha)ను చేర్చుకోవడంతో హస్తం పార్టీలో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ టికెట్‌ను తన కుమారుడు వంశీకి ఇప్పించేందుకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సోదరులు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌రావు మధ్య పొసగడం లేదు. రేవంత్ రెడ్డి మంత్రిమండలిలో స్థానం కోసం ఎవరికి వారు అంతర్గత ప్రయత్నాలు చేస్తుంటే పెద్దపల్లి ఎంపీ ఎంకటేశ్ నేత చేరికతో మూడో గ్రూపుగా మారింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ను పార్టీలో చేరిక సమాచారం ఇవ్వకపోవడం కాంగ్రెస్(Congress)లో అసంతృప్తికి దారితీస్తోంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కీలక నేతలుగా ఉన్న ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, వివేక్, వినోద్ సోదరులకు కనీసం మాట వరుసకైనా సంప్రదించకపోవడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.
చెన్నూరు నియోజకవర్గం నుంచి 2018లో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వెంకటేశ్ ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి 2019 పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా విజయం సాధించారు. శాసనసభ ఎన్నికల వరకు చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పని చేసిన ఆయనను ఇప్పుడు పార్టీలో చేర్చుకోవడమేంటని హస్తం పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఖమ్మం లోక్‌సభ అభ్యర్థ్విత్వం కోసం కాంగ్రెస్‌లో పోటాపోటీ - సోనియాగాంధీ బరిలో నిలిచేనా!