ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దీపావళి వేళ పేలుతున్న ధరలు - సామాన్యుల కష్టాలు

దీపావళి వేళ సామాన్యులకు ధరల దడ దడ - నెలలోనే 30-40 శాతం పెరిగిన బడ్జెట్‌

common_people_suffering_due_to_increase_in_prices_of_essential_commodities
common_people_suffering_due_to_increase_in_prices_of_essential_commodities (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 12 hours ago

Common People Suffering Due to Increase in Prices of Essential Commodities :దీపావళి పండుగ వేళ కూరగాయలు, నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భారీగా పెరిగిన ధరలతో మధ్యతరగతి ప్రజల జేబులు గుల్లవుతున్నాయి. నెల రోజుల్లోనే పండగ బడ్జెట్‌ 30 నుంచి 40 శాతానికి పైగా పెరిగిందని మధ్యతరగతి, సామాన్య ప్రజలు వాపోతున్నారు. రెండు, మూడు రోజులుగా పెరిగిన ధరల భారంతో ఆందోళన చెందుతున్నారు.

నూనెలు సలసల- పప్పులు కుతకుత :పాతవి, నాణ్యమైన బియ్యం కిలో రూ.60కు పైనే ఉన్నాయి. పప్పులు రూ.100లోపు ఏవీ లేవు. గత నెల శనగపప్పు కిలో రూ.64 నుంచి రూ.68 ఉండగా అది ప్రస్తుతం రూ.101కి చేరింది. మినపప్పు రూ.125 ఉండగా కందిపప్పు రూ.170కు. బెల్లం రూ.55-రూ.70 దాకా చేరాయి. లీటరు సన్‌ఫ్లవర్‌ నూనె కనీస ధర రూ.134 పలుకుతుంది.

కూరగాయలకు హై రేట్లు :ఏ కూరగాయ అయినా రైతుబజారులోనే రూ.60 కంటే ఎక్కువగా ఉండగా రిటైట్‌లో రూ.80 నుంచి రూ.100 దాకా ఉన్నాయి. టమాటా మాత్రం కిలో రూ.20 నుంచి రూ.30 ఉంది. బెండకాయ, వంకాయ, దొండకాయ, క్యారెట్, బీర అన్నీ రూ.60 నుంచి రూ.70 దాకా ఉన్నాయి. బీన్స్‌ రైతు బజార్‌లోనే రూ.120 ఉండగా రిటైల్‌లో రూ.140కి పైమాటే. ఆలు రూ.35నుంచి 50 దాకా ఉంది. వెల్లుల్లి రూ.400కు దిగి రావడం లేదు.

పండుగ వేళ పస్తులేనా? సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న నిత్యావసరాలు

కొనుగోళ్లు పరిమితంగానే :ధరల పెరుగుదల ప్రభావం అమ్మకాలపై పడిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. గతంలో కిలోల్లో కొనేవారు ఇప్పుడు అరకిలోనే తీసుకుంటున్నారని కూరగాయలు విక్రయించే రైతులు తెలుపుతున్నారు. కూరగాయల లభ్యత తగ్గడంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పరిమితంగా వస్తుండటంతోనే ధరలు పెరుగుతున్నాయన్నారు.

భయపెడుతున్న ధరలు :పండగ సరకుల ధరలు చూస్తే భయమేస్తోంది. సరకుల లిస్టులో అన్నీ కొనే పరిస్థితి లేదని, నెల క్రితం సరకుల వ్యయం రూ.3000 అయితే, ఈసారి అవే సరకులకు రూ. 4,100 దాకా చెల్లించాల్సి వస్తుందని సామాన్యులు వాపోతున్నరు. హోల్‌సేల్‌ షాపులోనే ఇలా ఉంటే ఇక చిల్లర దుకాణాల్లో ఇంకా ఎక్కువగా ఉన్నాయంటున్నారు.

రూ.700 ఖర్చయినా బ్యాగ్‌ నిండలేదు :రైతుబజార్‌లోనే రూ.700కు కూరగాయలు కొంటే కనీసం సంచి కూడా నిండటం లేదని, తక్కువ పరిమాణంలో కొన్నా గతం కంటే రెట్టింపు చెల్లించాల్సి వస్తుందని ఓ గృహిణి వాపోయారు. వారం, పది రోజులుగా ఇదే పరిస్థితి అని, పండగ వేళ ఎక్కువ కొందామనుకుంటే రేట్లు చూసి పరిమితంగానే కొనాల్సి వస్తుందని అంటున్నారు.

"మన దగ్గర బేరాల్లేవమ్మా!" - భయపెడుతున్న రైతు బజార్ మార్కెట్ రేట్లు

ABOUT THE AUTHOR

...view details