ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీ-విజిల్ ద్వారా ఫిర్యాదు చేస్తే 15 నిమిషాల్లో చేరుకుంటాం - సమస్య పరిష్కరిస్తాం

Collectors Instructions to Officers: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు విషయంలో అధికారులకు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నివేదికల సమర్పణ, సి.విజిల్, సువిధ యాప్, కంట్రోల్ రూమ్ నిర్వహణ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

Collectors  Instructions to Officers
Collectors Instructions to Officers

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 19, 2024, 7:40 PM IST

Collectors Instructions to Officers: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారులతో సమావేశం నిర్వహించారు. సీ-విజిల్ ద్వారా ఫిర్యాదు చేస్తే 15 నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకుని పరిష్కారమయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, రోజువారి నివేదికల సమర్పణ, సి.విజిల్, సువిధ యాప్, కంట్రోల్ రూమ్ నిర్వహణ తదితర అంశాలపై కలెక్టర్లు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

సీ-విజిల్ ద్వారా ఫిర్యాదు చేస్తే 15 నిమిషాల్లో చేరుకుంటాం - సమస్య పరిష్కరిస్తాం

కంట్రోల్ రూమ్ నిర్వహణ: ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ అధికారులు, డిజిటల్ అసిస్టెంట్లలతో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సమావేశం నిర్వహించారు. సాధారణ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, ఎన్నికల నివేదికల సమర్పణ, సి.విజిల్, సువిధ యాప్, కంట్రోల్ రూమ్ నిర్వహణ తదితర అంశాలపై జిల్లా కలెక్టరు దిశానిర్దేశం చేశారు. మోడల్ కోడ్ ప్రవర్తన నియమావళి, వ్యయ ఉల్లంఘలను, తదితర అంశాలు సి.విజిల్ యాప్ ద్వారా అందిన ఫిర్యాదుపై తక్షణం స్పందించాలని పేర్కొన్నారు. ఎన్నికల కమీషన్​కు రోజువారిగా సమర్పించే నివేదికలపై అధికారులు సకాలంలో స్పందించాలని కోరారు. షిఫ్ట్​ల వారీగా 24 గంటలు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. కంట్రోల్ రూమ్ పై ఫిర్యాదు రాకుండా అధికారులు, టెక్నికల్ సిబ్బంది సమన్వయంతో పని చెయ్యాలని కలెక్టర్ సమిత్ కుమార్ సూచించారు.

ఎంపీడీవో కార్యాలయంలో వాలంటీర్ జన్మదిన వేడుకలు - ప్రతిపక్షాల మండిపాటు

విగ్రహాలపై ముసుగులు: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తూచ తప్పకుండా అమలు చేయనున్నామని, ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపట్టనున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై సీపీ క్రాంతి రాణా టాటాతో కలిసి మీడియా సమావేశంలో తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 10,693 ఫొటోలు, పోస్టర్లు, బ్యానర్లు తొలగించామని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ స్థలాల్లో 1777 గోడ రాతలపై పెయింటింగ్ వేశామని చెప్పారు. పబ్లిక్ స్థలాల్లోని 1102 విగ్రహాలపై ముసుగులు వేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు 42 ఫ్లైయింగ్ స్క్వాడ్లు, 30 ఎంసీసీ బృందాల ఏర్పాటు చేశామని కలెక్టర్ చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన పిర్యాదుల కోసం 24x7 గంటలు పని చేసేలా కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, వాట్సప్ నంబర్ ను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. సీ-విజిల్ ద్వారా పిర్యాదు చేస్తే 15నిమిషాల్లో ఘటనా స్థలికి చేరుకుని పరిష్కారమయ్యేలా ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో తొలిసారి 37,760 మంది ఓటు వేయబోతున్నట్లు, 85 వయసు దాటిన, విభిన్న ప్రతిభావంతులు కోసం ఇంటి నుంచే ఓటింగు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

అనుమతి లేకుండా రాచమల్లు ప్రచారం - అడ్డుకున్న అధికారులు

కఠిన చర్యలు: ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజయవాడ సీపీ క్రాంతి రాణా టాటా స్పష్టం చేశారు. ఇప్పటివరకు పోలీసులు, సెబ్ అధికారులు పెద్దఎత్తున వేలాది లీటర్ల మద్యం పట్టుకున్నామని సీపీ చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 3,215 బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. అక్రమ మద్యం, నగదు తరలిపోకుండా చెక్ పోస్టుల వద్ద విస్తృత సోదాలు చేపడుతున్నామని సీపీ రాణా చెప్పారు.

బెగుసరాయ్​పై అందరి ఫోకస్- బీజేపీ హ్యాట్రిక్​ కొడుతుందా? ప్రత్యర్థుల వ్యూహం పనిచేస్తుందా?

ABOUT THE AUTHOR

...view details