Coalition Leaders Reacts On Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కొత్త జవసత్త్వాలు కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఇంధనాన్ని అందించడంపై కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇకపై విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అన్న మాటే ఉండదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. కేంద్రం ఇచ్చిన ఆర్థిక వెసులుబాటును స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సమర్థంగా వినియోగించుకోవాలని కోరారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగేటట్టుగా NDA ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించడంపై విశాఖ ఎంపీ భరత్ సంతోషం వ్యక్తం చేశారు. గతంలోనూ చంద్రబాబు అప్పటి ప్రధాని వాజ్‌పాయ్‌తో చర్చించి స్టీల్ ప్లాంట్‌కు ప్రత్యేక ఆర్థిక వెసులుబాటు ఇప్పించారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 11,440 కోట్లు - కేంద్రం అధికారిక ప్రకటన