తెలంగాణ

telangana

ETV Bharat / state

కోల్​ ఇండియాలో ఉద్యోగాలు - మొదటి నెల నుంచే రూ.50వేల వేతనం - COAL INDIA RELEASES RECRUITMENT

కోల్​ ఇండియాలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ - 640 మేనేజ్​మెంట్ ట్రెయినీ ఉద్యోగాలు - అర్హత, దరఖాస్తు విధానం, వయోపరిమితి వివరాలు తెలుసుకుందాం

Coal India Jobs
Coal India Jobs (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 29, 2024, 9:19 PM IST

Coal India Jobs :పోటీపరీక్షలకు ప్రిపేర్​ అవుతున్న ఉద్యోగార్థులకు గుడ్​న్యూస్​. కోల్​ ఇండియా లిమిటెడ్​ 640 మేనేజ్​మెంట్​ ట్రెయినీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. జీతభత్యాలు, అర్హత, వయోపరిమితి, పోస్టుల సంఖ్య తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఉద్యోగాలు :మొత్తం ఉద్యోగాల్లో జనరల్‌కు 190, ఈడబ్ల్యూఎస్‌లకు 43, ఎస్సీలకు 67, ఎస్టీలకు 34, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు 124 కేటాయించారు. బ్యాక్‌లాగ్‌ పోస్టులు 182 ఉన్నాయి.

దరఖాస్తు విధానం :ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

అభ్యర్థులను గేట్‌ స్కోర్‌- 2024 ఆధారంగా ఎంపిక చేస్తారు.

1. మైనింగ్‌-263 జాబ్స్​ : 60 శాతం మార్కులతో మైనింగ్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.

2. సివిల్‌ విభాగం-91 : 60 శాతం మార్కులతో సివిల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.

3. ఎలక్ట్రికల్‌ విభాగం-102 :ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ ఫస్ట్​ క్లాస్​లో ఉత్తీర్ణులై ఉండాలి .

4. మెకానికల్‌ విభాగం-104 : 60 శాతం మార్కులతో మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్​ డిగ్రీ.

5. సిస్టమ్‌-41: 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్‌/ కంప్యూటర్‌ సైన్స్‌తో బీఎస్సీ (ఇంజినీరింగ్‌)/ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌/ ఐటీ. లేదా మొదటి శ్రేణి డిగ్రీతోపాటు ఎంసీఏ.

6.ఈఅండ్‌టీ విభాగం-39 : 60 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ చేసి ఉండాలి.

వయోపరిమితి : 30.09.2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు పది నుంచి 15 ఏళ్లు, మాజీ సైనికోద్యోగులకు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సడలింపులు ఉంటాయి.

దరఖాస్తు రుసుము : రూ.1180. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ కోల్‌ ఇండియా లిమిటెడ్‌ ఉద్యోగులకు అప్లికేషన్​ ఫీజు లేదు.

  • గేట్‌ స్కోర్‌-2024, బ్రాంచ్‌లు, కేటగిరీలవారీగా 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల మెరిట్‌ జాబితాను తయారుచేస్తారు.
  • ప్రభుత్వ/ ప్రభుత్వరంగ సంస్థలు/ ప్రముఖ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నవాళ్లు ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ను దరఖాస్తు చేసుకునే సమయంలోనే అప్‌లోడ్‌ చేయాలి.
  • గేట్‌ స్కోర్‌ ఆధారంగా ఎంపికచేసిన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచుతారు. వీరికి సర్టిఫికెట్​ వెరిఫికేషన్​, మెడికల్​ ఎగ్జామినేషన్​ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
  • ఈ సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థుల ఈమెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబర్లకు కూడా తెలియజేస్తారు.

జీతభత్యాలు : ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో జీతభత్యాలు రూ.50,000-1,60,000 వరకూ ఉంటుంది. ట్రైనింగ్​ పూర్తి చేసిన తర్వాత వేతన శ్రేణి రూ.60,000-1,80,000 వరకూ ఉంటుంది. డియర్‌నెస్‌ అలవెన్స్(డీఏ), హెచ్‌ఆర్‌ఏ, పర్ఫార్మెన్స్‌ రిలేటెడ్‌ పే (పీఆర్‌పీ), లీవ్, మెడికల్, సీఎంపీఎఫ్, సీఎంపీఎస్, గ్రాట్యుటీ, పెన్షన్‌ తదితర సదుపాయాలూ ఉంటాయి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ : 28.11.2024

ముఖ్యగమనిక : ఈ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులను కోల్‌ఫీల్డ్స్‌లో మాత్రమే కాకుండా ఇతర అనుబంధ సంస్థల్లోనూ నియమించవచ్చు. కాబట్టి దేశవ్యాప్తంగా ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఒకరు ఒక పోస్టుకు మాత్రమే పోటీపడాలనే రూల్​ ఉంది.

వెబ్‌సైట్‌:www.coalindia.in

ఐటీఐతో హైదరాబాద్​లో జాబ్స్ - నెలకు రూ.30 వేల శాలరీ - టైమ్ తక్కువుంది త్వరపడండి!

భారీ వేతనంతో ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్స్​​ - మీ చేతిలో డిగ్రీ ఉందా- ఐతే అప్లై చేసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details