తెలంగాణ

telangana

వరద విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి తెలంగాణను ఆదుకోండి : ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి - CM Tour In khammam

By ETV Bharat Telangana Team

Published : Sep 3, 2024, 7:32 AM IST

CM Tour in khammam : వరద విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి పీకల్లోతు కష్టాల్లో ఉన్న తెలంగాణను కేంద్రం ఆదుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల దాటికి రూ.5 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా ఉందని, ఆ మొత్తాన్ని రాష్ట్రానికి కేటాయించాలని కోరారు. నష్టపోయిన బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రకృతి ప్రకోపానికి విలవిలలాడిన ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. ప్రతిపక్ష పార్టీ వరదలతో బురద రాజకీయం చేస్తుందని మండిపడ్డారు.

khammam Floods
CM Tour In khammam (ETV Bharat)

CM Tour In khammam : వరద విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి పీకల్లోతు కష్టాల్లో ఉన్న తెలంగాణను కేంద్రం ఆదుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల ధాటికి 5వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా ఉందని ఆ మొత్తాన్ని రాష్ట్రానికి కేటాయించాలని కోరారు. నష్టపోయిన బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రకృతి ప్రకోపానికి విలవిలలాడిన ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. ప్రతిపక్ష పార్టీ వరదలతో బురద రాజకీయం చేస్తుందని మండిపడ్డారు..

ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే : భారీ వర్షాలు, వరదలతో సర్వం కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న బాధితులకు అండగా నిలిచేందుకే సచివాలయంలో సమీక్షలు కాకుండా నేరుగా క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. ఖమ్మంలో మున్నేరు వరద మిగిల్చిన విషాదం చూసి చలించిపోయానన్నారు. ప్రకృతి విలయంలో నష్టపోయిన బాధిత కుటుంబాలన్నింటినీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని భరోసా ఇచ్చారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా సోమవారం ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించారు. పాలేరు నియోజకవర్గంలోని పాలేరు ఏటి ప్రవాహన్ని, మునిగిన పంట పొలాలను పరిశీలించారు. పాలేరు జలాశయానికి దిగువన సాగర్ ఎడమ కాల్వకు యూటీ వద్ద పడిన గండి పరిస్థితి అధికారులనడిగి తెలుసుకున్నారు. పోలెపల్లి పంచాయతీలోని రాజీవ్ గృహకల్పలో మున్నేరు ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు.

రెండు ఇళ్లల్లోకి వెళ్లి మహిళలతో మాట్లాడి ఓదార్చారు. నష్టం, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మున్నేరు వరదలతో సర్వం కోల్పోయామంటూ బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకోగా అధైర్యపడొద్దని అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తర్వాత ఖమ్మం చేరుకుని మంచికంటినగర్​లో పర్యటించారు.

అనంతరం ఖమ్మం కలెక్టరేట్​లో అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి భారీ వ‌ర్షాల‌తో ఉమ్మడి ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌, న‌ల్గొండ జిల్లాలకు తీవ్ర న‌ష్టం వాటిల్లింద‌ని, 16 మంది ప్రాణాలు కోల్పోయార‌ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవేద‌న వ్యక్తం చేశారు.

ల‌క్షల ఎక‌రాల్లో పంట న‌ష్టం వాటిల్లింద‌ని, ర‌హ‌దారులు, కాలువ‌లు, చెరువులకు గండ్లు ప‌డ‌డంతో పాటు విద్యుత్ స‌బ్‌స్టేష‌న్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయ‌ని ప్రాథ‌మికంగా 5వేల 438 కోట్ల మేర ఆస్తి న‌ష్టం వాటిలిన‌ట్లు అంచ‌నా వేశామ‌ని తెలిపారు. వరదలను కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా గుర్తించాలని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని పర్యటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

కేటీఆర్, హరీశ్‌రావు కేవలం మాటలకే పరిమితం : ఇంత‌టి విప‌త్కర ప‌రిస్థితుల్లో ప్రధాన ప్రతిప‌క్ష నేత కేసీఆర్ ఫాం హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటూ మౌన ముద్రలో ఉన్నార‌ని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేటీఆర్, హరీశ్‌రావు కేవలం మాటలకే పరిమితమయ్యారని వరదలపై సైతం బురద రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రతిఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి భరోసానిచ్చారు. వ్యాపార‌, స్వచ్ఛంద సంస్థలు బాధితుల‌ను ఆదుకునేందుకు ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. వరద సహాయక చర్యల్లో మరో నాలుగైదు రోజులపాటు అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సొమవారం రాత్రి ఖమ్మంలోని పొంగులేటి నివాసంలో బస చేసిన సీఎం నేడు మహబూబాబాద్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు.

నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేలు పరిహారం : రేవంత్‌ రెడ్డి - CM Revanth On Khammam Floods

రేపు 11 జిల్లాలకు భారీ వర్షసూచన - సెప్టెంబర్ 5 నుంచి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం! - Telangana Heavy Rains Expected

ABOUT THE AUTHOR

...view details