తెలంగాణ

telangana

ETV Bharat / state

రాహుల్​ గాంధీని చూసి కేసీఆర్​ బుద్ధి తెచ్చుకోవాలి : సీఎం రేవంత్ - CM REVANTH REDDY PUBLIC MEETING

కేసీఆర్​పై సీఎం రేవంత్​ రెడ్డి విమర్శలు - ఒక్కసారి ఓడిస్తే ప్రజలకు మొహం చూపరా? - హనుమకొండలో ప్రజా పాలన - ప్రజా విజయోత్సవ సభ

Prajapalana Vijayotsava Sabha
Prajapalana Vijayotsava Sabha (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 19, 2024, 6:29 PM IST

Updated : Nov 19, 2024, 11:02 PM IST

Praja Vijayotsava Sabha : ఉత్తర తెలంగాణకే తలమానికంగా వరంగల్​ అభివృద్ధి చెందుతుందని సీఎం రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. వరంగల్​ను అభివృద్ధి చేస్తే సగం తెలంగాణను అభివృద్ధి చేసినట్లేనని అన్నారు. విమానాశ్రయంతో వరంగల్​ రూపురేఖలు మారనున్నాయని తెలిపారు. చాలా రాష్ట్రాల్లో నాలుగైదు విమానాశ్రయాలు ఉన్నాయని.. కానీ తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు ఒకేఒక విమానాశ్రయం ఉందని చెప్పారు. గత ప్రభుత్వం చేయని పనులు మేం చేస్తుంటే కొందరు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. హనుమకొండలోని ఆర్ట్స్​ అండ్​ సైన్స్​ కళాశాల మైదానంలో జరిగిన ప్రజా పాలన - ప్రజా విజయోత్సవ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

కుట్రలు, కిరాయి రౌడీలతో అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్​ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్బుద్ధితో అభివృద్ధి పనులను అడ్డుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గ్యాస్​ సిలిండర్​ ధరను ప్రధాని మోదీ రూ.1200కు చేర్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో మాత్రం రూ.500కే గ్యాస్​ సిలిండర్​ ఇస్తున్నామని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రూ.500కే గ్యాస్​ సిలిండర్​ ఇచ్చారానని ప్రశ్నించారు.

రాహుల్​ గాంధీని చూసి కేసీఆర్​ బుద్ధి తెచ్చుకోవాలి : సీఎం రేవంత్ (ETV Bharat)

ఆడబిడ్డలను కోటీశ్వరులుగా మార్చడమే తమ కర్తవ్యం : "ఆడబిడ్డలను కోటీశ్వరులుగా మార్చేందుకు ఈ ప్రభుత్వం కంకణం క‌ట్టుకుంది. ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలంతా కోరుకుని దీవించారు. మమ్మల్ని దీవించి పదవులు ఇచ్చిన మిమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. గత ప్రభుత్వంలో కొన్నేళ్లపాటు మహిళా మంత్రి కూడా ఉండలేదు. ఇందిరమ్మరాజ్యంలో మాత్రం ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చేందుకు కార్యాచరణ చేపట్టాం. కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసేందుకు గత ప్రభుత్వానికి పదేళ్లపాటు మనసొప్పలేదు. తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తం చేయటంలో కాళోజీ పాత్ర ఎంతో ఉంది. ఎంతో పట్టుదలతో కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేశాం. వరంగల్‌ జిల్లా మంత్రి, ఇన్‌ఛార్జి మంత్రి పట్టుబట్టి అభివృద్ధి పనులు సాధించుకున్నారు." అని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు.

రూ.2 లక్షలలోపు రుణమాఫీని మాఫీ చేస్తాం : మహిళలపై సిలిండర్​, విద్యుత్​ ఛార్జీలు, ఆర్టీసీ బస్సు ఛార్జీల ఆర్థిక భారం తగ్గించామని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. ఇప్పుడు మిగులుతున్న డబ్బులను పిల్లల చదువులకు ఖర్చు చేసుకుంటున్నారని హర్షించారు. మాట ఇచ్చిన ప్రకారం ఆగస్టు 15లోపు రూ.2 లక్షల లోపు రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. వరంగల్​ గడ్డ నుంచే మరోసారి మాట ఇస్తున్నామని.. రూ.2 లక్షలలోపు రుణమాఫీ రైతులందరికీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ వర్తించలేదన్నారు. సమస్య పరిష్కరించి అందరికీ రుణమాఫీ పూర్తి చేస్తామని తెలిపారు. కేసీఆర్​ మాట ఇచ్చి పదేళ్లలో కూడా రుణమాఫీ పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం మాత్రం ఆర్నెళ్లలోనే రుణమాఫీకి రూ.18 వేల కోట్లు కేటాయించిందని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు.

"రాహుల్​ గాంధీని చూసి కేసీఆర్​ బుద్ధి తెచ్చుకోవాలి. ఒక్కసారి ఓడిస్తే.. మళ్లీ ప్రజల మొహం చూడవా? అధికారం ఇస్తే దోచుకోవటం.. ఓడిస్తే ఫామ్​హౌజ్​లో దాచుకోవటం. ప్రజల మీద ప్రేమ ఉంటే ఎందుకు ప్రజల మధ్యకు రావటం లేదు. నిజంగా ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్ల మధ్యకు వచ్చి ఎందుకు అడగటం లేదు. మూడుసార్లు అధికారం దక్కపోయినా.. రాహుల్​ గాంధీ ప్రజల మధ్యే ఉన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజల కోసం సూచనలు ఎందుకు చేయట్లేదు. తెలంగాణను వ్యతిరేకించిన, అవమానించిన మోదీకి కిషన్​రెడ్డి ఊడిగం చేస్తున్నారు. గుజరాత్​లో సబర్మతి సుందరీకరణను సమర్థించి.. మూసీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు."- రేవంత్​ రెడ్డి, సీఎం

కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించిన సీఎం : అంతకుముందు హనుమకొండలో కాళోజీ కళాక్షేత్రాన్ని సీఎం రేవంత్​ రెడ్డి ప్రారంభించారు. కాళోజీ కళాక్షేత్రంలో ఫొటో ప్రదర్శనను సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు తిలకించారు. కాళోజీ జీవిత విశేషాలు తెలిపేలా కళాక్షేత్రంలో ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేశారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభించారు. అంతకు ముందు హైదరాబాద్​ నుంచి హెలికాప్టర్​లో హనుమకొండకు చేరుకున్న సీఎం రేవంత్​ రెడ్డికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, సీతక్క ఘనస్వాగతం పలికారు. కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించిన అనంతరం, హనుమకొండలో ప్రజా పాలన - ప్రజా విజయోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సభలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

కొందరు చిచ్చుబుడ్లకు బదులు - సారాబుడ్లతో దీపావళి జరుపుకుంటున్నారు : సీఎం రేవంత్​

"ప్రధాని అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే - మేం నిజాలు చెబుతూనే ఉంటాం"

Last Updated : Nov 19, 2024, 11:02 PM IST

ABOUT THE AUTHOR

...view details