CM Revanth on Irrigation Department :మేడిగడ్డ పిల్లర్లు కుంగిన ఘటన అనంతరం గత ప్రభుత్వంవాఘా బార్డర్‌ను మించిన పోలీస్ ఫోర్స్‌ను బ్యారేజీ వద్ద పెట్టారని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth) పేర్కొన్నారు. అక్కడి వాస్తవాలు చూపేందుకు, సభ్యులందరికీ మేడిగడ్డలో(Medigadda Tour) ఏం జరిగిందో తెలియజేయడం కోసమే ఈపర్యటన ఏర్పాటు చేసినట్లు అసెంబ్లీలో సీఎం వెల్లడించారు. మంగళవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశం స్వల్పకాలిక చర్చలో మాట్లాడారు.
CM Revanth Medigadda Tour : "సాగునీటి ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలని మన పెద్దలు చెప్పారు. ప్రాజెక్టుల వల్లే కరవు ప్రాంతాల్లోనూ పంటలు పండించే అవకాశం వచ్చింది. తెలంగాణకు తాగు, సాగునీటి కోసం ప్రధానంగా రెండు నదులున్నాయి. అవి కృష్ణా, గోదావరి జలాలు. నిన్న కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చించాము. ప్రజలకు కొంతమేర నిజనిజాలు తెలిశాయి. గోదావరి జలాలపై కూడా తెలియాల్సి ఉందని" సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు.
"అప్పటి పాలకులు ప్రజల ఆలోచనను దృష్టిలో పెట్టుకుని తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత - చేవెళ్ల ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకుడు వెంకటస్వామి సూచన మేరకు ప్రాణహిత - చేవెళ్లకు అంబేడ్కర్ పేరు పెట్టారు. స్వరాష్టం వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు రీడిజైన్ అనే బ్రహ్మపదార్థం తీసుకొచ్చింది. ప్రాజెక్టుల రీడిజైన్ పేరిట తుమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును మరోచోట కట్టారు. బ్యారేజీ కింద ఇసుక కుంగడం వల్లే మేడిగడ్డ కుంగిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ప్రాజెక్టుల పేరుతో పేకమేడలు కట్టారా?" అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.