Cm Jagan Stone Pelting Case: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ అజిత్ సింగ్ నగర్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ కోర్టు విచారణ జరిపింది. నిందితుడ్ని 7 రోజుల కస్టడీ కావాలంటూ పోలీసుల తరుఫు న్యాయవాది వాదనలు వినిపించారు. నిందితుడి నుంచి కేసుకు సంబందించిన మరికొంత సమాచారం రాబట్టాలని పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మంగళవారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
కాగా సీఎం జగన్‌పై రాయి విసిరిన కేసులో నిందితుడిని 18వ తేదీన అరెస్టు చేసినట్లు చూపించారు. అజిత్‌సింగ్‌నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్‌ని నిందితుడిగా తేల్చారు. అయితే ఏ1గా సతీష్‌ను చూపించిన పోలీసులు ఏ2 ప్రోద్బలంతో జగన్‌పైకి రాయి విసిరాడని చెబుతున్నారు. కానీ అలా ప్రోత్సహించిన వ్యక్తి ఎవరన్నది మాత్రం తేల్చకుండానే కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించారు. నిందితుడికి మే 2 వరకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ కేసులో ఎవరిని ఇరికించడానికి ఇదంతా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సీఎంపై రాయి దాడి కేసుతో నాకు సంబంధం లేదు: దుర్గారావు - stone Pelting Case Suspect released
సీఎంపై రాయి దాడి కేసులో వడ్డెరకాలనీకి చెందిన అయిదుగురిని ఈ నెల 16 తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సతీష్ తప్ప మిగిలిన నలుగురు మైనర్లు. మూడు రోజుల విచారణ అనంతరం సతీష్ అరెస్టును 18వ తేదీన మధ్యాహ్నం చూపించారు. అరకొర సమాచారంతోనే రిపోర్టు తయారు చేశారు. సీఎంపైకి సతీష్ రాయి విసిరినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ ఘటనకు ఏ2 సూత్రధారి అని చెబుతున్న పోలీసులు ఆ వ్యక్తి పేరును మాత్రం ఇందులో ప్రస్తావించలేదు.