ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు చిత్తూరు జిల్లాలో జగన్ బస్సు యాత్ర- జనం అడిగే ప్రశ్నలకు బదులివ్వగలరా? - CM Jagan Chittoor Tour

CM Jagan Election Campaign in Chittoor District: చిత్తూరు డెయిరీని పునరుద్ధరిస్తా.! మూతబడిన చెక్కర కర్మాగారాలు తెరిపిస్తా.! గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్‌ పూర్తి చేసి సాగు నీళ్లిస్తా.!కుప్పంను మరో పులివెందులగా మారుస్తా.! చిత్తూరు జిల్లా గడ్డపై జగన్‌ గొంతు చించుకొని ఇచ్చిన హామీలివి.! ఈ ఐదేళ్లులో ఒక్కటీ నెరవేర్చని జగన్ మళ్లీ చిత్తూరు జిల్లా చెవిలో పూలు పెట్టేందుకు వస్తున్నారు.! మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రగా వస్తున్న జగన్ బస్సు దిగి జనం అడిగే ప్రశ్నలకు బదులివ్వగలరా?

CM_Jagan_Election_Campaign_in_Chittoor_District
CM_Jagan_Election_Campaign_in_Chittoor_District

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 3, 2024, 7:41 AM IST

Updated : Apr 3, 2024, 9:39 AM IST

నేడు చిత్తూరు జిల్లాలో జగన్ బస్సు యాత్ర- జనం అడిగే ప్రశ్నలకు బదులివ్వగలరా?

CM Jagan Election Campaign in Chittoor District:రాజకీయ నాయకులకు విశ్వసనీయంత ఉండాలంటూ నీతిసూత్రాలు వల్లించే జగన్‌ పాదయాత్రలో చిత్తూరు జిల్లాకు ఇచ్చిన హామీల్ని తుంగలో తొక్కారు. హంద్రీనీవా, గాలేరు నగరి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి చిత్తూరు జిల్లాలో బీడు భూములను సస్యశ్యామలం చేస్తానని విపక్ష నేతగా నమ్మబలికారు. అధికారం వెలగబెట్టిన ఐదేళ్లలో ఒక్క ఎకరాకూ అదనంగా సాగునీరివ్వలేదు. ఇక మూతపడిన రెండు సహకార చక్కెరపరిశ్రమల్ని తిరిగి తెరిపిస్తానంటూ ఉమ్మడి చిత్తూరు జిల్లా చెవిలో పెద్ద కాలీఫ్లవరే పెట్టారు జగన్‌.

కానీ అధికారంలోకి వచ్చాక పునరుద్ధరణను పక్కనపెట్టి పరిశ్రమల ఆస్తులు తెగనమ్మేందుకు లిక్విడేటర్‌ ఏర్పాటు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ప్రభుత్వానికి చుక్కెదురైంది. చిత్తూరు సహకార చక్కర పరిశ్రమలో 15వేల మంది, తిరుపతి సమీపంలోని గాజులమండ్యం సహకార చక్కర పరిశ్రమలో 13వేల మంది రైతులు భాగస్వాములుగా ఉన్నారు. జగన్‌ బస్సు దిగివచ్చి సమాధానం చెప్పాలని చెరకు రైతులు డిమాండ్ చేస్తున్నారు.

అనుయాయులకే బిల్లులు- పింఛన్లకూ డబ్బుల్లేకుండా ఊడ్చేసిన వైసీపీ సర్కార్ - Payment Of Bills During Elections

చిత్తూరు జిల్లాలో విజయ డెయిరీ పునరుద్ధరణ విషయంలోనూ జగన్‌ మడమ తిప్పేశారు. డెయిరీని తెరిపించకపోగా దాని ఆస్తుల్ని అమూల్ సంస్థకు కట్టబెట్టారు. 200 కోట్ల రూపాయల విలువైన 22 ఎకరాల భూమిని ఏడాదికి కేవలం కోటి రూపాయల చొప్పున 30 ఏళ్లపాటు లీజుకు కట్టబెట్టారు.! అప్పట్లో తలలు నిమురుతూ ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేయలేదని రైతులు జగన్‌ను ప్రశ్నిస్తున్నారు.

అధికారంలోకి వచ్చాక కూడా జగన్‌ చిత్తూరు జిల్లా ప్రజలకు నమ్మకద్రోహమే చేశారు. మూడేళ్ల క్రితం కొట్టుకుపోయిన వంతెనల్ని నేటికీ పునర్నిర్మించలేదు. వరదల సమయంలో స్థానికంగా పర్యటించిన జగన్‍, వెంటనే వంతెనలు నిర్మిస్తామని పెద్దపెద్ద మాటలు చెప్పారు. కానీ ఇసుక బస్తాలు, సిమెంట్ పైపులతో తాత్కాలికంగా నిర్మించిన వంతెనలే ప్రయాణానికి దిక్కయ్యాయి. పలమనేరు, పుంగనూరు, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల పరిధిలో స్వర్ణముఖినదిపై కొట్టుకుపోయిన వంతెనలదీ అదే పరిస్థితి.

పింఛన్ల పంపిణీ అంశంపై రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు లేఖ - Chandrababu Fight on Pensions

ఇక కుప్పంకైతే జగన్‌ ఏవేవో మాటలు చెప్పారు. సీఎం హోదాలో 2సార్లు కుప్పం వెళ్లిన జగన్‌ మరో పులివెందులగా అభివృద్ధి చేస్తానంటూ హామీ ఇచ్చారు. కుప్పం మేజర్ పంచాయతీని పురపాలికగా మార్చి ప్రజలపై పన్నుల భారం వేయడం తప్ప చేసిందేమీలేదు. కుప్పం పురపాలిక అభివృద్ధికి 66 కోట్ల రూపాయలు మంజూరు చేశామంటూ శంకుస్థాపనలు చేశారు.

మురుగు కాలువల సీసీ రోడ్ల నిర్మాణం, నూతనంగా బోర్ల తవ్వకాలు, పైపులు, వీధి దీపాల ఏర్పాటు, సామాజిక భవనాల నిర్మాణం, ఉద్యానవనాల అభివృద్ధి, శ్మశాన వాటిక అభివృద్ధి వంటి పనులు చేస్తామని అరచేతిలో వైకుంఠం చూపారు. రామకుప్పం, శాంతిపురం, కుప్పం, గుడుపల్లె మండలాల అభివృద్ధికి 100 కోట్లు రూపాయలు విడుదల చేస్తానని హామీ ఇచ్చినజగన్‌ఒక్క రూపాయి విడుదల చేయలేదు. ఇదీ కుప్పం జిల్లాకు జగన్‌ అధికారంలోక రాకముందు, వచ్చాక చేసిన నమ్మక ద్రోహం.

Last Updated : Apr 3, 2024, 9:39 AM IST

ABOUT THE AUTHOR

...view details