ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్ బస్సుయాత్ర దృశ్యాల్లో కనిపించాలి-అప్పుడే మీకు డబ్బులు! తరలించిన జనాలకు వైసీపీ నేతల మెలికలు - CM Jagan Bus Yatra

CM Jagan Bus Yatra got Poor Response from People: సీఎం జగన్‌ పర్యటనకు జనాల కోసం వైసీపీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తాజాగా జగన్‌ విశాఖ పర్యటనలో మహిళలను రోడ్లపైకి తీసుకువచ్చి స్లిప్పులు పంపిణీ చేశారు. బస్సు యాత్రలో తీసిన ఫొటోల్లో కనిపిస్తేనే డబ్బులు ఇస్తామని మహిళలకు చెప్పారు. సీఎం ర్యాలీకి హాజరుకావాలంటూ మహిళా సంఘాల సభ్యులను వైసీపీ నేతలు హెచ్చరించారు.

jagan_bus_yatra
jagan_bus_yatra

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 21, 2024, 11:00 PM IST

CM Jagan Bus Yatra got Poor Response from People:సీఎం జగన్‌ విశాఖ పర్యటనకు జన సమీకరణ కోసం వైసీపీ నేతలు తీవ్రంగా శ్రమించారు. మహిళలను రోడ్లపైకి తీసుకువచ్చి స్లిప్పులు పంపిణీ చేశారు. బస్సు యాత్రలో తీసిన ఫొటోల్లో కనిపిస్తేనే డబ్బులు ఇస్తామని మహిళలకు చెప్పారు. సీఎం ర్యాలీకి హాజరుకావాలంటూ మహిళా సంఘాల సభ్యులను వైసీపీ నేతలు హెచ్చరించారు. జగన్ యాత్రకోసం విశాఖ వైసీపీ అభ్యర్థులు జన సమీకరణ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. ఇంకో పక్క జగన్‌ పర్యటన జరుగుతున్న ప్రాంతాల్లో కరెంట్‌ తీసేయడంతో అక్కడి ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. జగన్‌ ఎక్కడ అడుగుపెట్టినా సమాన్యులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చస్తున్నారు.

డబ్బులిచ్చి ఆర్టీసీ బస్సుల్లో తరలించినా వెనుదిరిగిన జనం - వైసీపీ శ్రేణుల విస్మయం - cm ys jagan bus yatra

CM YS Jagan Bus Yatra:అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్‌ నిర్వహించిన బస్సుయాత్ర (Jagan Memantha Siddham Bus Yatra) జనం లేక వెలవెలబోయింది. శనివారం యాత్ర ప్రారంభంలోనే పట్టుమని 200 మంది కూడా లేకపోవడంతో పార్టీ వర్గాలు సైతం ఆందోళన చెందాయి. సీఎం బస్సుయాత్రతో గొడిచెర్ల, డొంకాడ, జి.జగన్నాథపురం, చీడిక కొత్తూరు, ముకుందరాజుపేట తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తుని నుంచి విశాఖ మార్గంలో వాహనాలను నిలిపివేయడంతో దాదాపు రెండు గంటలపాటు వాహనదారులు అవస్థలు పడ్డారు.

సీఎం జగన్​ ప్రచార వాహనం వెంట ఎస్పీ, సీపీలు ఉండాలి - డీజీపీ తీరుపై విమర్శలు - CP And SPs to Guard in CM Jagan

యాత్ర పొడవునా జనం లేకపోయినా సీఎం జగన్ బస్సులో నుంచే అభివాదం చేస్తూ వెళ్లిపోయారు. సభలకు పెద్దగా స్పందన లేకపోవడంతో సీనియర్‌ నేతల వద్ద సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కసింకోట మండలంలో నిర్వహించిన సిద్ధం సభలో వక్తలు ప్రసంగిస్తుండగానే జనం వెనుదిరిగారు. డబ్బులు ఇచ్చి మరీ ఆర్టీసీ బస్సుల్లో జనాన్ని తరలించినా నేతల ప్రసంగాలు వినడానికి జనం ఆసక్తి చూపకుండా బయటకు వచ్చేయడంతో వైసీపీ శ్రేణులను విస్మయానికి గురి చేసింది.

వైఎస్సార్సీపీ అభ్యర్థులంతా సౌమ్యులైతే - ప్రభుత్వ, ప్రజలు సొమ్ములు ఏమైనట్లు జగన్? - Public Satires On YSRCP Candidates

బలవంతంగా తరలింపు:సీఎం జగన్​ సభలకు, దారి పొడువునా ప్రజలను పోగు చేయడానికి వైసీపీ నాయకులు నానా అవస్థలు పడుతున్నారు. జగన్​ బహిరంగ సభలకు జనాన్ని పార్టీ శ్రేణులు బలవంతంగా తరలిస్తుంటే, మరికొంత మంది డబ్బు, మద్యం ఆశ చూపి జనాన్ని పోగు చేస్తున్నారు. ఇంకా కొందరు అయితే జగన్​ సభలకు రాని వారిపై దాడులు కూడా చేస్తున్నారు. జగన్​ జిల్లాలో పర్యటిస్తున్నారు అంటేనే స్థానికులు భయపడుతున్నారు. జనాన్ని నాయకులు భయపెట్టి బలవంతంగా సభలకు తరలించినా వారు మాత్రం మధ్యలోనే వెనుతిరుగుతున్నారు. నాయకుల ప్రసంగం మెదలు కాకుండానే సభా ప్రాంగణం పూర్తిగా ఖాళీ అవుతుంది.

జగన్ బస్సుయాత్ర దృశ్యాల్లో కనిపించాలి-అప్పుడే మీకు డబ్బులు! ర్యాలీ హంగామాతో స్థానికులకు ముచ్చెమటలు

ABOUT THE AUTHOR

...view details