ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసులతో మంత్రి సతీమణి దురుసు ప్రవర్తన - సీఎం చంద్రబాబు అసంతృప్తి - cm chandrababu serious - CM CHANDRABABU SERIOUS

CM Chandrababu Serious on Minister Wife Issue: పోలీసులతో మంత్రి రాంప్రసాద్‌ సతీమణి ప్రవర్తించిన తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులతో హరిత మాట్లాడిన తీరును తప్పుపట్టిన సీఎం, మంత్రి రాంప్రసాద్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరణ కోరారు. అధికారులు, ఉద్యోగుల పట్ల గౌరవంగా ఉండాలన్న సీఎం, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తే ఉపేక్షించనని తెలిపారు.

cm chandrababu serious
cm chandrababu serious (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 1, 2024, 10:48 PM IST

Updated : Jul 1, 2024, 11:01 PM IST

CM Chandrababu Serious on Minister Wife Issue:రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Mandipalli Ramprasad Reddy) భార్య హరిత పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలంలో పింఛన్ల పంపిణీకి బయల్దేరిన ఆమె, ఇటీవల ఎన్నికల ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసుల ఎస్కార్ట్ కోసం వేచి చూశారు. గత ఐదేళ్లూ వైఎస్సార్సీపీకి తొత్తులా పని చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న రాయచోటి ఎస్సై అరగంట తర్వాత అక్కడికి రావడంతో ఎంతసేపు నిరీక్షించాలంటూ హరిత అసహనం వ్యక్తం చేశారు.

కాన్ఫరెన్స్ ఉందని చెప్పడంతో సీఐకి లేని కాన్ఫరెన్స్ మీకెందుకని అసహనం వ్యక్తం చేశారు. మీకు జీతం ప్రభుత్వం ఇస్తుందా లేక వైఎస్సార్సీపీ నాయకులు ఇస్తున్నారా అని ఎస్ఐని నిలదీశారు. సారీ చెప్పడంతో ఎందుకు సారీ అంటూ విసుక్కున్నారు. అనంతరం ఆమె పింఛన్ల పంపిణీకి చిన్నమండెం మండలానికి వెళ్లారు. మంత్రి భార్య అసహనం వ్యక్తం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై వెంటనే మంత్రి కార్యాలయం స్పందించింది పోలీసులు ఆలస్యంగా రావడం వల్లే మంత్రి భార్య అసహనం వ్యక్తం చేశారని, ఏమైనా గొడవలు జరుగుతాయని కారణంతోనే ఎస్కార్ట్ కోసం మంత్రి భార్య వేచి చూశారని వివరణ ఇచ్చుకున్నారు.

ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తా: పవన్ కల్యాణ్‌ - Pawan Kalyan meeting in Gollaprolu

చంద్రబాబు అసంతృప్తి: పోలీసులతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి ప్రవర్తించిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులతో మంత్రి భార్య హరితా రెడ్డి మాట్లాడిన తీరును సీఎం తప్పుబట్టారు. ఘటన తన దృష్టికి రావడంతో మంత్రితో ఫోన్​లో మాట్లాడిన సీఎం వివరణ కోరారు. అధికారులు, ఉద్యోగుల పట్ల అంతా గౌరవంగా మసలుకోవాలని, ఇలాంటి వైఖరిని సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఏ స్థాయి వారు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఘటనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి, ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటానని చంద్రబాబుకు వివరణ ఇచ్చుకున్నారు.

పింఛను డబ్బులు చోరీ చేశారని డ్రామా - సచివాలయ ఉద్యోగి సస్పెన్షన్‌ - Sachivalayam Employee Suspended

పింఛన్ల పంపిణీలో సచివాలయ సిబ్బంది చేతివాటం - ఎమ్మెల్యే జూలకంటి ఆగ్రహం - MLA Julakanti On Secretariat Staff

ఆర్టీసీకి మంచిరోజులు- 1400 బస్సుల కొనుగోలుకు సీఎం గ్రీన్​ సిగ్నల్​ : మంత్రి రాంప్రసాద్​రెడ్డి - New Busses For Apsrtc

Last Updated : Jul 1, 2024, 11:01 PM IST

ABOUT THE AUTHOR

...view details