CM Chandrababu Review On Rains AP: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. వర్ష ప్రభావం తగ్గినా చాలా ప్రాంతాల్లో వరద ఇబ్బందులు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. బాధితుల వద్దకు సహాయక బృందాలు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Minister Gottipati Ravi Kumar Review on Officers : భారీ వర్షాల వల్ల విద్యుత్ శాఖకు జరిగిన నష్టంపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వీటీపీఎస్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో 2500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం కలిగిందని గొట్టిపాటి వెల్లడించారు. వర్షపు నీటిని తోడే పనులు నిర్విరామంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇందుకోసం పోలవరం నుంచి నీరు తోడే పంపులు తెప్పిస్తున్నామని తెలిపారు.
జలదిగ్బంధంలో విజయవాడ - గత 20 ఏళ్లలో ఎన్నడూ చూడనంత వర్షం - ఆరుగురు మృతి - HEAVY RAINS IN VIJAYAWADA
విద్యుదుత్పత్తికి అంతరాయం :రాష్ట్రంలో విస్తారమైన వర్షాల కారణంగా బొగ్గు తడిచిపోవడం వల్ల విద్యుదుత్పత్తికి అంతరాయం కలిగిందని గొట్టిపాటి వెల్లడించారు. విద్యుదుత్పత్తి పునరుద్ధరణకు 2 నుంచి 3 రోజులు పట్టే అవకాశం ఉందని తెలిపారు. ఎప్పుడూ లేనంతగా రికార్డ్ స్థాయిలో అధిక వర్షం కురవడం వల్ల సబ్ స్టేషన్లు సైతం నీట మునిగాయని పేర్కొన్నారు. వాటిని పునరుద్ధరిస్తూ విద్యుత్ సరఫరా చేసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలియజేశారు.
పలు చోట్ల విద్యుత్ కోతలు : విజయవాడలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురవడం వల్ల నగరంలోనూ పలు చోట్ల విద్యుత్ కోతలు ఉన్నాయని తెలిపారు. అధికారులు, సిబ్బంది అంతా క్షేత్రస్థాయిలోనే ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తున్నారని తెలిపారు. ఎక్కడా ప్రాణ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో కొన్ని చోట్ల ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశామని పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి వారి సూచనలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు వేగవంతం చేశామని వెల్లడించారు. విద్యుత్ శాఖాపరమైన సమస్యలన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అత్యవసరమైతేనే బయటకు రండి - ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని మంత్రులు సూచనలు - Heavy Rains in aP
ప్రజలు బయటకు రావద్దు - వర్షాలపై అధికారులతో చంద్రబాబు సమీక్ష - Chandrababu Instructions on Rains