ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డయేరియా పంజా - రెండ్రోజుల్లో ఐదుగురు మృతి - సీఎం చంద్రబాబు ఆరా

విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో డయేరియా మరణాలపై సీఎం విచారం - బాధితుల పరిస్థితి, వైద్య సేవలపై ఆరా

By ETV Bharat Andhra Pradesh Team

Published : 13 hours ago

CM_REVIEW_ON_DIARRHEA_CASES
CM_REVIEW_ON_DIARRHEA_CASES (ETV Bharat)

CM Chandrababu Review on Diarrhea Vizianagaram District :విజయనగరం జిల్లాలో డయేరియా మరణాలపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. డయేరియాతో గత రెండు రోజుల వ్యవధిలోనే ఐదుగురు మృతి చెందిన సంఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మంగళవారం ఒక్కరోజే నలుగురు మృతి చెందారన్న సమాచారంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో బాధితుల పరిస్థితి, వారికి అందుతున్న చికిత్స, గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అతిసారం వ్యాధి కలకలం : విజయనగరం జిల్లాలోని మండల కేంద్రమైన గుర్లలో అతిసారం వ్యాధి కలకలం రేపుతోంది. వ్యాధిబారిన పడి రెండు రోజుల క్రితం ఒకరు మృతిచెందగా మంగళవారం మరో నలుగురు మరణించారు. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. వరుస మరణాలతో గుర్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మూడు రోజులుగా గ్రామంలో పలువురు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.

గుర్లలో విజృంభించిన డయేరియా - ఒక్కరోజే నలుగురి మృతి

రెండ్రోజుల్లో ఐదుగురు మృతి : వీరిలో తోండ్రంకి రామయ్యమ్మ (60) అనే వృద్ధురాలు మంగళవారం ఇంటివద్దే చనిపోయారు. సారిక పెంటయ్య (65) అనే వృద్ధుడు విజయనగరం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచారు. గుమ్మడి పైడమ్మ (50) విజయనగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. కలిశెట్టి సీతమ్మ (45) అనే మహిళను చికిత్స కోసం విశాఖ కేజీహెచ్​కు తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. మరో 10 మంది దాకా డయేరియా వ్యాధితో బాధపడుతూ విజయనగరం, విశాఖలోని వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే :బాధితుల్లో మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉన్నారు. బాధితులకు వైద్య సేవలు అందించిన ఆశా కార్యకర్త కూడా అతిసారం వ్యాధికి గురయ్యారు. గుర్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే కళా వెంకట్రావు పరామర్శించారు. వైద్యాధికారులతో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు, మంచినీటి వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు.

విజయనగరం జిల్లాలో డయేరియా కలకలం - ఆస్పత్రిపాలైన విద్యార్థులు - Students Hospitalized with Diarrhea

అంతుచిక్కని కారణాలు :గుర్ల గ్రామంలో అతిసారంతో ప్రజలు మరణిస్తున్నా అందుకు అసలు కారణాలేమిటన్నవి అధికార యంత్రాంగం ఇంత వరకు తేల్చలేదు. పారిశుద్ధ్య లోపం, మురుగు కాలువల్లో తాగునీటి కుళాయిలు, తాగునీటి ట్యాంకులు శుభ్రం చేయకపోవడం వంటివి ఈ పరిస్థితికి కారణమని గుర్ల గ్రామస్థులు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వాస్తవ కారణాలు నిగ్గు తేల్చి, డయేరియాన్ని అదుపులోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు.

కర్నూలులో ప్రబలిన అతిసారం - చిన్నారి మృతి - DIARRHEA SPREADS IN KURNOOL

ABOUT THE AUTHOR

...view details