Parawada Pharma City Incident: అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం ఫార్మా ఘటన మరువక ముందే పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్ సంస్థలో గురువారం అర్ధరాత్రి ఘటన జరిగింది. రసాయనాలు కలుపుతుండగా జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులకు గాయాలు అయ్యాయి. దీంతో వారిని హుటాహుటిన విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన కార్మికులు ఝార్ఖండ్‌కు చెందినవారిగా గుర్తించారు.
ఛార్జింగ్ చేస్తుండగా ప్రమాదం:6 కిలోలీటర్ల రియాక్టర్‌లో కెమికల్ నింపి ఛార్జింగ్ చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మ్యాన్‌హోల్ నుంచి రసాయనం ఉప్పొంగి పైకప్పుకు తగిలి కార్మికులపై పడింది. దీంతో గాయపడిన కార్మికులను హుటాహుటిన విశాఖలోని ఇండస్ ఆస్పత్రికి తరలించారు. జార్ఖండ్‌కు చెందిన లాల్‌సింగ్, కోహర్, రోసకు గాయాలు అయ్యాయి. వీరితో పాటు విజయనగరానికి చెందిన కెమిస్ట్ సూర్యనారాయణ గాయపడ్డారు.
స్పందించిన సీఎం చంద్రబాబు:ఘటనపై జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. హోంమంత్రి, ఇతర ఉన్నతాధికారులను వెంటనే వెళ్లాలని ఆదేశించిన సీఎం, మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు.