ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో రిలయన్స్​ రూ.65 వేల కోట్ల పెట్టుబడి - సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ - CM CBN ON RELIANCE INVESTMENT IN AP

రాష్ట్రంలో 500 కంప్రెస్సెడ్ బయో గ్యాస్ ప్లాంట్స్ ఏర్పాటు కానున్నాయని తెలిపిన సీఎం చంద్రబాబు - రిలయన్స్‌ పవర్‌తో ఎంవోయూ చేసుకున్నట్లు వెల్లడి

cm_cbn_on_reliance_investment_in_ap
cm_cbn_on_reliance_investment_in_ap (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 12, 2024, 7:27 PM IST

CM Chandrababu on Reliance Investment in AP:రాష్ట్రంలో రూ.65 వేల కోట్ల పెట్టుబడులకు రిలయన్స్ ఎనర్జీ సంసిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. రిలయన్స్‌ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం జరిగిందని ఈ క్రమంలో రిల‌య‌న్స్​తో ఎంవోయూ చేసుకున్నామని సీఎం తెలిపారు. 500 సీబీజీ ప్లాంట్​లు రానున్న 3 సంవ‌త్సరాల్లో పూర్తిచేసేలా ఎంవోయూ చేసుకున్నామని వివరించారు. దీని వ‌ల్ల రూ.130 కోట్ల మేర ఒక్కో ప్లాంట్​కు రూ.65 వేల కోట్లతో ప్రాజెక్టు కార్యరూపం దాల్చుతుందని స్పష్టం చేశారు. 'ఏపీ ది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' అయితే 'రిల‌య‌న్స్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' చేయాలని సూచించారు.

సీబీజీకి ఉపయోగపడే పంటల సాగుతో ఎకరాకు రూ.30 వేలు వస్తాయని సీఎం తెలిపారు. 39 లక్షల ఖాళీ సీబీజీ ఉత్పత్తి చేయడం వల్ల జీడీపీకి ఉపయోగపడుతుందని తెలిపారు. దీని వ‌ల్ల ఇండ‌స్ట్రీయ‌ల్ గ్రోత్ భారీగా జ‌ర‌గుతుందని పేర్కొన్నారు. 500 సీబీజీ ప్లాంట్లతో రోజుకు 9.38 లక్షల ఎల్‌సీవీలకు ఇంధనం అందిస్తుందని సీఎం వివరించారు. 110 ల‌క్షల మెట్రిక్ ట‌న్నులు ఫెర్మెంటెడ్ ఆర్గానికి మెన్యూర్ వ‌ల్ల కెమికల్ ఫెర్టిలైజ‌ర్స్ వాడకం త‌గ్గుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే క్లీన్ ఎన‌ర్జీ పాల‌సీ 2024 ఇప్పటికే తీసుకువ‌చ్చామని అన్నారు.

స్టాక్​ మార్కెట్​లో లాభాల ఎర! - కోటి రూపాయలు పోగొట్టుకున్న సివిల్ ఇంజినీర్

రూ.10 ల‌క్షల కోట్లు పెట్టుబ‌డులు ఈ పాల‌సీ ద్వారా ఆక‌ర్షించాల‌ని భావిస్తున్నట్లు వెల్లడించారు. పాల‌సీ ద్వరా 7.5 లక్షల ఉద్యోగాలు అనుకుంటే 2.5 ల‌క్షల ఉద్యోగాలు రిల‌య‌న్స్ ప‌వ‌ర్ ఇస్తోందని తెలిపారు. రిలయన్స్ పెట్టుబడుల సాధనలో బాగా కృషి చేశారంటూ మంత్రులు నారా లోకేశ్​, గొట్టిపాటి రవి, టీజీ భరత్​ను సీఎం చంద్రబాబు అభినందించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న ముకేష్‌ అంబానీకి సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

8 జిల్లాల్లో బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు: బయోగ్యాస్ ప్లాంట్లను ప్రకాశం జిల్లా నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) వివరించారు. ప్రస్తుతం 8 జిల్లాల్లో బయోగ్యాస్ ప్లాంట్లు రిలయన్స్‌ సంస్థ ఏర్పాటు చేయనుందని అన్నారు. మూడేళ్లలో బయోగ్యాస్‌ ప్లాంట్ల నిర్మాణం పూర్తి అయ్యేలా చూస్తామని అన్నారు. బయోగ్యాస్ ప్లాంట్ల వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ప్రభుత్వం తరఫు నుంచి అన్నిరకాల సహకారం అందిస్తామని మంత్రి లోకేశ్ అన్నారు.

బడ్జెట్​లో మహిళలకు ఆర్థిక సహకారం - 'ఆడబిడ్డ నిధి'కి కేటాయింపులు

అభివృద్ధి, సంక్షేమాల కలబోత - ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరులూదేలా బడ్జెట్‌

ABOUT THE AUTHOR

...view details