Richest CM Chandrababu Naidu in India :ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా నిలిచారు. ఆయన కుటుంబం ఆస్తులు రూ.931 కోట్లు ఉన్నాయి. అప్పు రూ.10 కోట్లు ఉంది. రూ.15 లక్షల ఆస్తి ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (West Bengal Chief Minister Mamata Banerjee) ఈ జాబితాలో అట్టడుగున నిలిచారు. ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను సోమవారం అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) విడుదల చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన పేరిట రూ.36 కోట్ల ఆస్తులు ఉండగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) పేరిట రూ.895 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇందులో హెరిటేజ్ ఫుడ్స్‌లో ఉన్న షేర్లనూ (Heritage Foods Share) కలిపి లెక్కించారు.
దేశంలో ధనిక సీఎం చంద్రబాబు - ఆస్తి ఎంతంటే? - CHANDRABABU NAIDU RICHEST CM
ఇండియాలో సంపన్న సీఎం చంద్రబాబు - వెల్లడించిన ఏడీఆర్ నివేదిక
CM Chandrababu Naidu Richest CM in India (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 31, 2024, 8:47 AM IST
గేరు మార్చి వేగం పెంచుతాం - అధికారులు సిద్ధం కావాలి: చంద్రబాబు
- అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక ఏం చెప్పిందంటే..
- రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంల సగటు ఆస్తి రూ.52.59 కోట్లుగా ఉంది.
- సీఎంల సగటు ఆదాయం ఏడాదికి రూ.13,64,310గా ఉంది.
- 31 మంది సీఎం మొత్తం ఆస్తి రూ.1,630 కోట్లుగా ఉంది.
- సంపన్న సీఎంలలో రెండో స్థానంలో ఉన్న అరుణాచల్ సీఎం పెమా ఖండూ ఆస్తి రూ.332 కోట్లు. ఆయనకు అత్యధికంగా రూ.180 కోట్ల అప్పు ఉంది.
- మూడో స్థానంలో ఉన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆస్తి రూ.51 కోట్లు. ఆయనకు రూ.23 కోట్ల అప్పు ఉంది.
- రూ.55 లక్షల ఆస్తులతో జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉన్నారు.
- రూ.1.18 కోట్ల ఆస్తులతో కేరళ సీఎం పినరయి విజయన్ (Kerala CM Pinarayi Vijayan) అట్టడుగు నుంచి మూడో స్థానంలో నిలిచారు.