ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టీటీడీని పొలిటికల్ చేశారు- వీఐపీ టిక్కెట్లు అమ్ముకున్నారు: చంద్రబాబు - CM Chandrababu Naidu on Tirumala - CM CHANDRABABU NAIDU ON TIRUMALA

CM Chandrababu on Tirumala Laddu Ghee Row: శ్రీవేంకటేశ్వరస్వామిని ఇష్టమైన దైవం అని భక్తులు భావిస్తారని, తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ఇప్పటి వరకు ఏ పాలకులు ప్రవర్తించలేదని సీఎం చంద్రబాబు అన్నారు. కానీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తిరుమల వేంకటేశ్వరస్వామిని కూడా వదల్లేదని ధ్వజమెత్తారు.

CM Chandrababu
CM Chandrababu (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 22, 2024, 7:58 PM IST

Updated : Sep 22, 2024, 10:18 PM IST

CM Chandrababu on Tirumala Laddu Ghee Row: ప్రపంచ వ్యాప్తంగా తిరుమలకు ఎంతో విశిష్టత ఉందని, ఇప్పటి వరకూ పాలకులెవ్వరూ దాని పవిత్రత దెబ్బతీసే సాహసం చేయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తిరుమల వేంకటేశ్వరస్వామిని కూడా వదల్లేదని ధ్వజమెత్తారు. ఎందరికో స్పూర్తిదాయకమైన పవిత్ర క్షేత్రంలో గత 5 ఏళ్లుగా అపవిత్ర కార్యక్రమాలు చేపట్టారని ధ్వజమెత్తారు. రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను మార్చారని దుయ్యబట్టారు. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు.

స్వామి వారు అందరి అకౌంట్లు సెటిల్ చేస్తారు:రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి 7 కొండల్ని 2 కొండలు అంటేనే ఎంతో పోరాటం చేశామని గుర్తుచేశారు. తనకు వ్యక్తి గతంగానూ తిరుమల శ్రీవారంటే చిన్నప్పటి నుంచీ ఎంతో నమ్మకమని చెప్పారు. అలిపిరి ఘటనలో తాను ప్రాణాలతో బయటపడటం స్వామి చేసిన అద్భుతమే తప్ప, ఆ బ్లాస్ట్​లో ప్రాణాలతో బయటపడటం అసాధ్యమన్నారు. స్వామి వారు అందరి అకౌంట్లు ఎప్పటికప్పుడు సెటిల్ చేస్తారని, అది ఆయన మహత్యమని తెలిపారు. గత ఐదేళ్లలో భక్తుల మనోభావాలకు విలువలేదని, వారి సమస్యలు పట్టించుకోలేదని మండిపడ్డారు.

భక్తుల మనోభావాలపై దాడి జరిగింది - ప్రశ్నించకుండా ఎలా ఉండగలం? - జగన్​పై పవన్​ తీవ్ర ఆగ్రహం - Pawan kalyan Deeksha

Chandrababu on Tirumala Prasadam Quality: తిరుమల లడ్డూ న్యాణ్యత, సువాసనకు ఎంతో విశిష్టత ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్వామి మహత్యం ఉంది కాబట్టే ఎంతో మంది లడ్డూని కాపీరైట్ చేయాలనుకున్నా చేయలేకపోయారని, అంతటి విశిష్టత ఉన్న లడ్డూకి వాడే పదార్థాలకు రివర్స్ టెండరింగ్ పెట్టి నాణ్యత దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకం వారికి గేట్లు తెరిచినట్లుగా రివర్స్ టెండరింగ్ నిబంధనలు మార్చేశారని మండిపడ్డారు.

ఫలితంగా ప్రధాన సంస్థలు ఏవీ టెండర్​లో పాల్గొనలేక పోయాయన్నారు. వైఎస్సార్సీపీ వచ్చీ రావడంతోనే ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీశారని, ట్రస్టు బోర్డుల నియామకాలు ఓ గ్యాంబ్లింగ్​గా మార్చేశారని ధ్వజమెత్తారు. ఇష్టానుసారంగా వీఐపీ టిక్కెట్లు అమ్ముకోవడం సహా కొండపై వ్యాపారాలు చేశారని ఆరోపించారు. అన్య మతస్తులను టీటీడీ ఛైర్మన్​గా వేశారని, రాజకీయ కేంద్రంగా బోర్డుని వాడుకున్నారని దుయ్యబట్టారు. తిరుమల అన్నదానంలో భోజనం చేస్తేనే ఓ ప్రత్యేక అనుభూతి కలిగేలా కార్యక్రమాలు చేపట్టామని వివరించారు.

శ్రీవారి లడ్డూ లెక్కలు మారిపోయాయ్! - నాణ్యత పునరుద్ధరించిన టీటీడీ - SRIVARI LADDU QUALITY

Chandrababu on Jagan Comments: ఎన్‌డీడీబీ రిపోర్ట్ ద్వారా ప్రజల మనోభావాలు దెబ్బతింటే, ఎదురుదాడితో తప్పుని కప్పిపుచ్చుకోవాలని చూడటం క్షమించరాని నేరమని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. నివేదిక వాస్తవాలు తాను కప్పిపుచ్చి తారుమారు చేసి బయట పెట్టాలని జగన్ కోరుకుంటున్నాడా అని నిలదీశారు. ఎదురుదాడితో ప్రజలు చేసిన అపచారం మర్చిపోతారనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఆ నివేదిక బయట పెట్టకపోతే ప్రజలకు వాస్తవాలు ఎలా తెలుస్తాయన్నారు. ఎక్కువ రోజులు నిల్వ ఉండాల్సిన లడ్డూ త్వరగా పాడవటం, రంగు మారటం వంటి పరిణామాలు చూశామని చెప్పారు. లడ్డూ రుచి చూసిన వారెవ్వరైనా నాణ్యత లేదని ఇట్టే చెప్పేవారన్నారు.

తిరుమల ప్రక్షాళనకు దేవుడు తనకొక అవకాశం ఇచ్చారని, శ్యామలరావుకి చెప్పి, అందుకనుగుణంగా పనిచేయాలని చెప్పి ఈవోగా నియమించినట్లు వివరించారు. లడ్డూ నాణ్యతపై అనుమానం తోనే 4 ట్యాంకర్లను ఎన్‌డీడీబీ పరీక్షలకు పంపామని, ల్యాబ్​లో పరీక్షల తర్వాత ఎస్ వాల్యుల్లో భారీ వ్యత్యాసాలు వెలుగు చూశాయని వెల్లడించారు. వెంటనే ఈవో సదరు సంస్థలకు నోటీసులు ఇచ్చి, బ్లాక్ లిస్ట్​లో పెట్టడం వంటి చేయాల్సిన బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. తదుపరి చర్యలకు నిపుణుల కమిటీ కూడా వేసి మళ్లీ టెండర్లు పిలిచారన్నారు. అధికారం చేపట్టాక ఇలా అనేక పరిణామాలు చోటుచేసుకుని ఎన్నో వాస్తవాలు వెలుగు చూశాయని తెలిపారు.

నెయ్యి సేకరణ విధానాలు, టెండర్ నిబంధనలు మార్చాల్సిందే- తేల్చి చెప్పిన నిపుణుల కమిటీ - TTD Report to Laddu Issue

CBN on YSRCP Leaders Statements:చేసిన తప్పుని సమర్ధించుకుంటూ ప్రధానికి లేఖ రాయటానికి జగన్‌కి ఎంత ధైర్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజకీయ ముసుగులో వచ్చిన నేరస్థుడు కాబట్టే జగన్​ని ఎస్కోబార్ అన్నానని గుర్తుచేశారు. ఎంతో అపచారం చేసి సమర్ధించుకుంటున్నారంటే ఏమనుకుంటున్నారని నిలదీశారు. నిన్నటి నుంచి ఒక్కొక్క స్టేట్మెంట్ చూస్తుంటే కడుపు రగిలిపోయి ఆవేశం వస్తోందని మండిపడ్డారు. టీటీడీ ఛైర్మన్​గా చేసిన వైవీ సుబ్బారెడ్డి భార్య బైబిల్ పట్టుకుని తిరుగుతుందని గుర్తుచేశారు.

మరో మాజీ ఛైర్మన్ భూమన తన ఇంట్లో పెళ్లిని క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం చేశాడన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు మతసామరస్యాన్ని కాపాడడం తన బాధ్యత అని స్పష్టం చేశారు. తనకు నచ్చిన దేవుడికి పూజ చేసుకోవడం తన కర్తవ్యమన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బ తినే విధంగా చేసిన అపచారాలన్నీ కప్పిపుచ్చుకుంటూ ఎదురు దాడి చేస్తే ఎలా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 3.75 లక్షల వీఐపీ టిక్కెట్లు ఇచ్చుకున్నారని తెలిపారు.

CBN on Jagan Mistakes: తిరుమల విషయంలో జగన్ చేసిన పాపాలు ప్రజలకు ముందే తెలిసి ఉంటే, ఆ 11 కూడా గెలిచేవాడు కాదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. కరుడుగట్టిన నెరస్థుడైన వ్యక్తికి ఉగ్రవాద మనస్తత్వం ఉంటేనే, చేసిన తప్పుకు క్షమాపణలు కోరక పోగా ఇలా ఎదురు దాడి చేసే ఆలోచనలు వస్తాయని ధ్వజమెత్తారు. రాసే అబద్ధాలకు హద్దే లేదన్నట్లుగా ప్రధానికి లేఖ రాస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేయరాని తప్పులు చేసి తనపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. నేరం చేసి, ఆ తప్పులు కాయమన్నట్లుగా వ్యవహరిస్తూ ఎటు పోతున్నారో అర్ధం కావట్లేదని దుయ్యబట్టారు. చేసిన తప్పుని ఒప్పని ఇంట్లో కూర్చుని సర్టిఫికెట్ లు ఇస్తారా అని నిలదీశారు.

ఇంగిత జ్ఞానం ఉన్న వారెవ్వరైనా 320 రూపాయలకు నెయ్యి కొనుగోలు చేస్తూ రివర్స్ టెండర్లు తెస్తారా అని ప్రశ్నించారు. నిబంధనలు అన్నీ తారుమారు చేసి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారు రాజకీయాలు చేస్తుంటే, వారికి సమాధానాలు ఇవ్వాలంటే తమకే సిగ్గుగా ఉందన్నారు. స్వామి వారి పవిత్రతను ఎవ్వరూ మలినం చేయలేరని స్పష్టం చేశారు. టీటీడీ పవిత్రత కాపాడటం కూటమి బాధ్యత అని తేల్చిచెప్పారు. మొత్తం ప్రక్షాళన చేసి, దేవుడు తన పూర్వవైభవం కాపాడుకునేందుకు మనుషులుగా మన వంతు ప్రయత్నాలు చేద్దామన్నారు. ఇప్పటికే జరిగిన తప్పుకు ఆగస్టు 15న జగన్‌ యాగం చేశారని గుర్తుచేశారు.

సింహాచలంలో ఏం జరుగుతుందో!- చౌక ధరకే నెయ్యి సరఫరా- సీజ్ చేసిన అధికారులు - Ghee Seized in Simhachalam Temple

Last Updated : Sep 22, 2024, 10:18 PM IST

ABOUT THE AUTHOR

...view details