ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెమ్మగిల్లిన చంద్రబాబు కళ్లు- మట్టిని ముద్దాడి అమరావతికి సాష్టాంగ వందనం చేసిన సీఎం - CM Chandrababu Visit Amaravati

Chandrababu Amaravati Tour : జగన్‌ విధ్వంస పాలనకు నాందిపడిన ప్రజావేదిక కూల్చివేత ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పర్యటన ప్రారంభమైంది. ఐదేళ్ల పాటు వైసీపీ చేసిన నిర్లక్ష్యం అడుగడుగునా దర్శనమిస్తుండగా అమరావతి పునర్నిర్మాణమే లక్యంగా, సీఎం రాజధానిలో పర్యటిస్తున్నారు. గతంలో చేపట్టిన నిర్మాణాలు ఆయన పరిశీలిస్తూ ముందుకెళ్తున్నారు.

Chandrababu Amaravati Tour
Chandrababu Amaravati Tour (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 20, 2024, 12:48 PM IST

Updated : Jun 20, 2024, 5:07 PM IST

CM Chandrababu Visit Amaravati Updates : ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణ పనుల్ని, వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. ఇందులో భాగంగా తొలుత జగన్‌ విధ్వంసాన్ని అంచనా వేయాలనే ఉద్దేశంతో రాజధానిలో పర్యటిస్తున్నారు. ఉదయం 11:00 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆయన పర్యటన ప్రారంభమైంది.

CBN Inspected Prajavedika in Amaravati : తొలుత జగన్‌ కక్షగట్టి కూల్చేయించిన ప్రజావేదికను చంద్రబాబు సందర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే, కూల్చేసిన ప్రజావేదిక శిథిలాలలను ముఖ్యమంత్రి పరిశీలించారు. కూల్చివేతలకు చిరునామాగా నిలిచిన జగన్‌ ప్రభుత్వంలో, కనీసం ఆ శిథిలాలను కూడా తొలగించలేదు. చంద్రబాబు కూడా జగన్‌ చేసిన విధ్వంసం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో, ప్రజావేదిక శిథిలాల తొలగింపు చేపట్టమని ఇటీవల తేల్చిచెప్పారు.

ప్రజావేదిక పరిశీలన అనంతరం చంద్రబాబు కరకట్ట రోడ్డు మీదుగా సీడ్‌ యాక్సెస్​ రహదారిపైకి వెళ్లారు. దారి పొడవునా ఎక్కడా తట్ట మట్టిసిన పరిస్థితి లేకపోవడాన్ని కళ్లారా చూశారు. రాజధాని రైతుల ఆవేదనను కళ్లకు కడుతూ భూములన్నీ, జగన్‌ అరాచకానికి సాక్ష్యాలుగా నిలవడాన్ని గమనించారు. సీడ్‌ యాక్సెస్​ రహదారి మీదుగా చంద్రబాబు అమరావతి శంకుస్థాపనన జరిగిన ఉద్ధండరాయునిపాలెం ప్రాంతానికి బస్సులో వెళ్లారు.

చెమ్మగిల్లిన చంద్రబాబు కళ్లు- మట్టిని ముద్దాడి అమరావతికి సాష్టాంగ వందనం చేసిన సీఎం (ETV Bharat)

నాటి రోజులను గుర్తు చేసుకున్న చంద్రబాబు : అమరావతి శంకుస్థాపన ప్రాంతానికి వెళ్లిన చంద్రబాబు నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. గొప్ప సంకల్పంతో నిర్మించ తలపెట్టిన అతిరథ మహారథులను ఆహ్వానించిన చోట, ప్రస్తుతం పాడుబడిన ప్రాంతంగా మారిన పరిస్థితిని చూశారు. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి మట్టిన భద్రపరిచిన చోటుకు వెళ్లిన ఆయన సాష్టాంగపడి నమస్కరించారు. ఆ తర్వాత పైకి లేచి వందనం సమర్పించారు. అభివృద్ధికి చిరునామాగా నిలవాల్సిన ప్రాంతం, దారుణ పరిస్థితుల్లో ఉండటంపై తీవ్ర ఆవేదన చంద్రబాబు కళ్లలో వ్యక్తమైంది. అనంతరం శంకుస్థాపన జరిగిన చోటుకు వెళ్లి శిలాఫలకాలను పరిశీలించారు.

ఏపీ అంటే అమరావతి, పోలవరం- త్వరలో వీటిపై శ్వేతపత్రాలు: సీఎం చంద్రబాబు - CM Chandrababu Media Conference

తరువాత ప్రజా ప్రతినిధుల క్వార్టర్లను సీఎం సందర్శించారు. నిర్మాణం పూర్తైన గదులను చూసిన చంద్రబాబు, తానొస్తున్నానని ప్రత్యేక ఏర్పాట్లేం చేయలేదు కదా అని అధికారులను ప్రశ్నించారు. రాజధాని నిర్మాణ పనుల వాస్తవ పరిస్థితి తనకు తెలియాలని అన్నారు. అటువంటిదేం లేదని అధికారులు సీఎంకు వివరించారు. క్వాలిటీ మెటిరీయల్ వాడటం వల్ల సరైన నిర్వహణ లేకున్నా చెక్కుచెదర లేదని ఎమ్మెల్యే కొలికిపూడి తెలిపారు. బాత్రూలంతో సహా వివిధ గదుల్ని పరిశీలించారు. ప్రజా ప్రతినిధుల క్వార్టర్లు దాదాపు 80-90 శాతం మేర నిర్మాణం పూర్తయ్యాయి.

ఐకానిక్ సెక్రటేరీయేట్, అసెంబ్లీల నిర్మాణ ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించారు. నీట మునిగిన ఐకానిక్ సెక్రటేరీయేట్, అసెంబ్లీల ప్రాంతం పరిశీలించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ విధ్వంసాన్ని మించిన నష్టం చేసిందని ధ్వజమెత్తారు. అదే విధంగా జడ్జీల బంగ్లాలను చంద్రబాబు పరిశీలించారు. సీఆర్డీఏ ప్రాజెక్టు ఆఫీస్ 77 శాతం, ఎన్జీవో హౌసింగ్ 62 శాతం, గెజిటెడ్ ఆఫీసర్ల హౌసింగ్ 60 శాతం, ఉన్నతాధికారుల బంగ్లాలు 28.50 శాతం, జడ్జీల, మంత్రుల బంగ్లాలు 27.30 శాతం పూర్తయ్యాయని చంద్రబాబు పేర్కొన్నారు.

షెడ్యూల్ ప్రకారం పర్యటన ముగించుకున్న చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించేందుకు సీఆర్డీయే కార్యాలయానికి చేరుకున్నారు. అయితే నిర్మాణం పూర్తయిన 4వ తరగతి ఉద్యోగుల భవనాలు పరిశీలించలేదని గుర్తించిన అనంతరం వాటి పరిశీలనకు మళ్లీ వెనక్కి బయలుదేరి వెళ్లారు. గ్రూప్ - డి హౌసింగ్ 75 శాతం మేర పూర్తయినట్లు అధికారులు చంద్రబాబుకు వివరించారు. దాదాపు రెండున్నర గంటల పాటు రాజధాని నిర్మాణ పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రజల జీవితాల్లో వెలుగు తెచ్చే బాధ్యత వ్రధాని మోదీపైనా, తన పైన ఉందని చంద్రబాబు తెలిపారు. అమరావతికి ఎంత నష్టం జరిగిందనే విషయమై అంచనా వేస్తామన్నారు.

పోలవరం ఎప్పటికి పూర్తిచేద్దామనుకుంటున్నారు?- ప్రాజెక్టు నిర్మాణ బాధ్యులపై సీఎం అసహనం - Chandrababu Visit Polavaram Project

Last Updated : Jun 20, 2024, 5:07 PM IST

ABOUT THE AUTHOR

...view details