CM Chandrababu letter to Union Agriculture Minister:మిర్చి రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని కోరుతూ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. మార్కెట్ జోక్యం ద్వారా తగ్గిన ధరను భర్తీ చేసేలా చూడాలని లేఖలో పేర్కొన్నారు. సాగు వ్యయానికి విక్రయ ధర మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలన్నారు.
50 శాతం నిష్పత్తిలో కాకుండా వంద శాతం నష్టాన్ని కేంద్రమే భరించాలని అభ్యర్థించారు. ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఏపీలోని మిర్చి రైతులను ఆదుకోవాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా గడచిన 10 ఏళ్లుగా మిర్చి ఉత్పత్తి, ధరలపై సీఎం చంద్రబాబు వివరాలు సమర్పించారు.