CM Chandrababu Birthday Wishes to Megastar Chiranjeevi:పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి సీఎం చంద్రబాబు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్వయంకృషితో సినీరంగంలో ఎన్నో విజయాలను అందుకుని, ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన ఆయన వెండితెర ఆణిముత్యమని కొనియాడారు. తరాలు మారినా చెక్కుచెదరని ప్రేక్షకాభిమానం ఆయన సొంతమని పేర్కొన్నారు. ఆయన స్థాపించిన ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్లు తనలోని మానవత్వానికి నిదర్శనమని కొనియాడారు. చిరంజీవి మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని అన్నారు. పేరు సార్ధకం చేసుకునేలా ఆయన చిరంజీవిగా ఉండాలని, ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు అన్నారు.
Minister Lokesh Wishes to Megastar:మెగాస్టార్ చిరంజీవికి మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మీ నటన తెలుగు ప్రేక్షకులకు ఓ వరం అంటూ కొనియాడారు. మీ డ్యాన్స్ అభిమానులకు కనుల విందు అని పేర్కొన్నారు. బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రాణ దానం చేస్తున్న మీ సేవా స్ఫూర్తి మాకు ఆదర్శమని కొనియాడారు. దేవుని ఆశీస్సులతో, తెలుగు ప్రజల ఆదరాభిమానాలతో, ఆయురారోగ్యాలతో వందేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని మంత్రి లోకేశ్ అన్నారు.
యువత చిరంజీవి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి:విజయవాడలోని 16వ డివిజన్లో జరిగిన పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎంపీ కేశినేని శివ నాథ్ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్క్రూ బ్రిడ్జి దగ్గర వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి డోక్క సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేటి యువత, విద్యార్థులు చిరంజీవి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.