Clarity on Post Graduation in Abroad For Degree Students :చాలామంది డిగ్రీ, బీటెక్‌లు చదివి కొంతకాలం ఉద్యోగం చేసి, వివిధ కోర్సులు నేర్చుకుని విదేశాలకు వెళ్లాలి అనుకుంటారు. అలా సమయం గడిపి విదేశాలకు వెళ్లడం కరెక్టా కాదా అన్నది ప్రశ్నే. ఎందుకంటే విదేశాల్లో చదువంటే డబ్బుతో కూడుకున్న వ్యవహారం. అలాగే అక్కడ చదువుకున్న తర్వాత ఉద్యోగం కచ్చితంగా వస్తుందా అంటే చెప్పలేం. ఇదే అనుమానం ఒకరికి వచ్చి నిపుణులను కలిశారు. తాను ఇంటర్ ఒకేషనల్ (ఓఏఎస్) చేసి, బీకాం (కంప్యూటర్స్), బీఈడీ పూర్తిచేశారు. ఇప్పుడు విదేశాల్లో పీజీ చదివి అక్కడే ఉద్యోగం చేయాలనుకుంటున్నారని తెలిపారు. ఇప్పుడు తన వయసు 33 ఏళ్లు. తీసుకున్న నిర్ణయం సరైనదేనా అని అడగ్గా కెరియర్ నిపుణులు ఏం అన్నారో ఇప్పుడు చూద్దాం.
విద్యార్థులు నాలుగు సంవత్సరాలు బీటెక్ డిగ్రీతో ఎంఎస్, ఎంబీఏలు చదవడానికి విదేశాలకు వెళ్లాలి అనుకుంటారు. మీరు మూడేళ్లు బీకాం (కంప్యూటర్స్) చదివారు, విదేశాల్లో కంప్యూటర్ అప్లికేషన్స్/ బిజినెస్ మేనేజ్‌మెంట్/ హాస్పిటర్ మేనేజ్‌మంట్/ టూరిజంలో పీజీ చేసే అవకాశముంది. విదేశాలకు వెళ్లి పీజీ చేసేందుకు కనీసం మరో మూడేళ్లు పడుతుంది. అంటే వయసు ఇంకా పెరుగుతోంది. అప్పుడు ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు గత ఉద్యోగానుభవం కీలక పాత్ర పోషిస్తుంది. మీరు ఇంతకాలం ఎలాంటి ఉద్యోగాలు? మీకు ఏ రంగంలో స్కిల్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఆ అంశాలను బట్టి ఉద్యోగావకాశాలుంటాయి.
ఈ దేశాల్లో IELTS అవసరం లేకుండానే యూనివర్శిటీల్లో అడ్మిషన్లు - Study Abroad Without IELTS
ఎక్కడైనా కెరీర్ ప్రారంభించగలం అనే నమ్మకం ఉండాలి : విదేశాల్లో పీజీ చదవడానికి వయసుతో సంబంధం ఏమీ లేదు కానీ, పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది. అంత ఖర్చు పెట్టి చదివినా మంచి ఉద్యోగం వస్తుందన్న భరోసా లేదు. ఆసక్తి ఉంటే ఎడ్యుకేషన్/ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే అవకాశముంది. మీకు నచ్చిన ఉద్యోగం వచ్చేవరకు ఎలాంటి చిన్న ఉద్యోగం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. ఒకవేళ చదువు పూర్తయిన తర్వాత అక్కడ ఉద్యోగం రాకపోయినా స్వదేశానికి తిరిగి వచ్చి ఇక్కడ ఉద్యోగం చేయాలి అన్న ఆలోచన, నమ్మకం, ఆసక్తి ఉంటే విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేయొచ్చు.