Police Special Treatment to Borugadda Anil Kumar : ఇటీవల రిమాండ్ ఖైదీ బోరుగడ్డ అనిల్‌కుమార్‌కు రాజమహేంద్రవరం కారాగారానికి తరలిస్తూ రెస్టారెంట్‌లో బిర్యానీ పెట్టించిన విషయం తెలిసిందే. తాజాగా మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. పోలీస్ స్టేషన్‌లో రాచమర్యాదలు చేసిన విషయం సంచలనంగా మారింది.
Borugadda Anil Kumar Police Station CCTV Video Viral :రిమాండ్ ఖైదీ బోరుగడ్డ అనిల్‌కుమార్‌కు అరండల్‌పేట పోలీసు స్టేషన్‌లో మర్యాదలు చేయటాన్ని పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. ఈ మేరకు సీఐ శ్రీనివాసరావును వీఆర్‌కు పంపుతూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 26 నుంచి 29 వరకు పోలీసు కస్టడీలోకి తీసుకుని అనిల్ కుమార్‌ను స్ధానిక పోలీసులు విచారించారు.
అప్పట్లో అనిల్‌కు పోలీసులు బల్లమీద పడక ఏర్పాటు చేయటం, దిండు ఇవ్వటం, కుర్చీలో కూర్చోబెట్టిన సీసీ ఫుటేజీలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో వెంటనే ఐజీ విచారణకు ఆదేశించారు. ఎస్పీ సతీష్ కుమార్ ఇచ్చిన ప్రాధమిక నివేదికను అనుసరించి ఈ విషయంలో సీఐ నిర్లక్ష్యం ఉందని తేల్చి చర్యలకు ఉపక్రమించారు. స్టేషన్‌లో నుంచి ఫుటేజీలు బయటకు వెళ్లటాన్ని తీవ్రంగా పరిగణించారు. దీనికి సీఐ నిర్వాకమే కారణమని గుర్తించి చర్యలు చేపట్టినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి.