ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమలలో చిరుత కలకలం - భక్తుల కారు సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు - Cheetah spotted at Tirumala - CHEETAH SPOTTED AT TIRUMALA

Cheetah in Tirumala Ghat Road: తిరుమల కొండపై చిరుత కనిపించడం మరోసారి కలకలం రేపింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్‌ రోడ్డులో భక్తుల కారుకు అడ్డుగా వచ్చిన చిరుత దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న భక్తులు చిరుతను చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.

cheetah_at_tirumala
cheetah_at_tirumala (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 15, 2024, 1:31 PM IST

Updated : May 15, 2024, 5:44 PM IST

తిరుమలలో చిరుత కలకలం - భక్తుల కారు సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు (ETV Bharat)

Cheetah in Tirumala Ghat Road: తిరుమల కొండపై చిరుత సంచరించడం మరోసారి కలకలం రేపింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో చిరుత కనిపించింది. తెల్లవారుజామున భక్తుల కారుకు చిరుత అడ్డొచ్చింది. కారు సీసీటీవీ కెమెరాలో చిరుత పులి దృశ్యాలు రికార్డయ్యాయి. చిరుతను చూసిన వారు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అది ఒక్కసారిగా రోడ్డును దాటుకొని ఇటు నుంచి అటు వెళ్లిపోయింది. దీంతో చిరుత రోడ్డు దాటి వెళ్లిపోవడంతో కారులో వెళ్తున్న వారు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా తిరుమల ఘాట్​ రోడ్డులో చిరుత కనిపించడం భక్తులను భయాందోళనకు గురి చేసింది.

Cheetah Attack Boy Discharge: చిరుత దాడిలో గాయపడిన బాలుడు డిశ్చార్జ్

ఇటీవల కాలంలో తిరుమల కాలినడక మార్గంలో ఓ చిన్నారి చిరుత దాడికి బలై ప్రాణాలు కోల్పోయింది. దైవదర్శనానికని బయల్దేరిన కుటుంబంలో చిన్నారి మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. దీంతో ఆ బాలిక తల్లిదండ్రుల అక్రందనలు ఆకాశన్నంటాయి. తిరుపతిలో అలిపిరి కాలినడక మార్గం వద్ద రాత్రి 11 గంటలకు లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో ఓ చిరుత కాలినడకన కొండపైకి వెళ్తున్న కుటుంబంపై దాడి చేసింది. ఈ దాడిలో ముందుగా నడిచి వెళ్తున్న లక్షిత అనే 6 సంవత్సరాల బాలికపై దాడి చేసి అడవిలోకి లాక్కెల్లింది. ఇంకో గంట సమయమైతే కొండపైకి చేరుకుంటారనే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిరుత దాడితో కుటుంబసభ్యులు భయంతో కేకలు వేశారు. అప్రమత్తమైన అక్కడి వారు చిరుతను వెంబడించేందుకు ప్రయత్నించారు.

Cheetah Attack on Kid: తిరుమలలో బాలుడిపై చిరుత దాడి.. పరిస్థితి విషమం

ఇదే విధంగా మరోసారి ఘాట్​ రోడ్డులో చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత కారణంగా నడకదారి భక్తులకు ఎటువంటి అపాయం తలెత్తకుండా ముందే అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. గతంలో చిరుతకు బలైపోయిన చిన్నారిలా మరొకరి ప్రాణాలకు హానికలగక ముందే అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. టీటీడీ అధికారులు కూడా చిరుత సంచారంపై అప్రమత్తంగా ఉండాలి. కాలినడకన వెళ్తున్న భక్తులను పర్యవేక్షించేందుకు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను అప్రమత్తం చేస్తే చిరుత జాడను తెలుసుకునేందుకు వీలుగా ఉంటుంది.

Chirutha Attack on Girl: అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడి.. బాలిక మృతి

Last Updated : May 15, 2024, 5:44 PM IST

ABOUT THE AUTHOR

...view details