ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రతి ఒక్కరూ సీపీఆర్​ నేర్చుకోవాలి- బాలుడిని కాపాడిన డాక్టర్​ రవళికి సన్మానం - Doctor Ravali - DOCTOR RAVALI

Doctor Ravali Saved Young Boy Life: ప్రతి లక్ష మంది జనాభాలో 4 వేల మంది గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారని వైద్యురాలు రవళి అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలుడికి సీపీఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టిన డాక్టర్‌ రవళిని విజయవాడలో సన్మానించారు. గుండెపోటు వచ్చిన వ్యక్తులకు మొదటి ఆరు నిమిషాల్లో సీపీఆర్ చేస్తే ప్రాణాలు నిలబెట్టవచ్చని డాక్టర్‌ రవళి తెలిపారు.

Doctor Ravali
Doctor Ravali (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 21, 2024, 5:09 PM IST

Doctor Ravali Saved Young Boy Life: ప్రతి లక్ష మంది జనాభాలో 4 వేల మంది గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారని వైద్యురాలు రవళి అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలుడికి సీపీఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టిన డాక్టర్‌ రవళిని (Dr Ravali ) విజయవాడలో సన్మానించారు. గుండెపోటు వచ్చిన వ్యక్తులకు మొదటి ఆరు నిమిషాల్లో సీపీఆర్ చేస్తే ప్రాణాలు నిలబెట్టవచ్చని డాక్టర్‌ రవళి తెలిపారు. ప్రతి ఒక్కరికీ సీపీఆర్ చేసే పద్ధతిని నేర్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. తాను కాపాడిన బాలుడు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడని భావోద్వేగానికి గురయ్యారు.

ఇదీ జరిగింది: విజయవాడ అయ్యప్పనగర్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు సాయి ఈ నెల 5వ తేదీన ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. బుజ్జి కన్నా లేవరా అని తల్లడిల్లుతూ తల్లిదండ్రులు ఎంత పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. ఒక్కసారిగా వారి గుండె ఆగినంత పనైంది. తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొని బిడ్డను భుజాన వేసుకొని ఆసుపత్రికి పరుగులు తీశారు. ఈ దృశ్యాలు అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేశాయి.
దేశంలో గుండెపోటు కలవరం- 10లక్షల మందికి CPR ట్రైనింగ్​- 1000కిపైగా కేంద్రాల్లో

మెడ్‌సీ ఆసుపత్రిలో ప్రసూతి వైద్య నిపుణురాలైన డాక్టర్‌ నన్నపనేని రవళి అటుగా వెళ్తూ ఇదంతా గమనించారు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. బాలుడ్ని పరీక్షించి అక్కడే రోడ్డుపైనే పడుకోబెట్టమని చెప్పారు. అనంతరం కార్డియో పల్మోనరీ రిససిటేషన్‌-సీపీఆర్ చేయడం ప్రారంభించారు. ఒకవైపు డాక్టర్‌ రవళి బాలుడి ఛాతీపై చేతితో ఒత్తుతూ అక్కడున్న మరో వ్యక్తిని నోటితో గాలి ఊదమని సూచించారు. ఇలా ఏడు నిమిషాలకు పైగా చేశాక బాలుడిలో కదలిక వచ్చింది. వైద్యురాలి కృషి ఫలించడంతో ఆ బాలుడు మళ్లీ ఊపిరితీసుకున్నాడు.
హార్ట్ ఎటాక్ వస్తే సీపీఆర్ ఎలా చేయాలి? సింపుల్ స్టెప్స్​ ఇవిగో!

వెనువెంటనే బాలుడ్ని దగ్గరలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి బైక్‌పై తీసుకెళ్లారు. ఆసుపత్రికి వెళ్లే మార్గంలోనూ బాలుడికి శ్వాస సరిగ్గా అందేలా తలను కొద్దిగా కిందకి ఉంచి పడుకోబెట్టి తీసుకెళ్లమని సూచించారు. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత చికిత్స చేయడంతో పూర్తిగా కోలుకున్నాడు. 24 గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచి తలకు సీటీ స్కాన్‌ చేస్తే ఎలాంటి సమస్య లేదని గుర్తించి, డిశ్చార్జి చేసి ఇంటికి పంపించేశారు. ప్రస్తుతం బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు.

వైద్యురాలు రవళి (ETV Bharat)

సామాజిక మాధ్యమాల్లో వైరల్​ గా మారిన వీడియో : డాక్టర్‌ రవళి రోడ్డుపైనే బాలుడ్ని పడుకోబెట్టి సీపీఆర్‌ చేసే సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వైద్యురాలి పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది. అందులో భాగంగా నేడు డాక్టర్ రవళికి విజయవాడలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ డాక్టరమ్మ చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే​ - సోషల్​ మీడియాలో వీడియో వైరల్​ - CPR to boy on the road

ABOUT THE AUTHOR

...view details