ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజాగళం విజయవంతం - ట్విట్టర్ ద్వారా స్పందించిన చంద్రబాబు - Chandrababu respond on Twitter

Chandrababu React on Prajagalam Sabha success:పల్నాడు జిల్లా చిలుకలూరుపేట ప్రజాగళం భహిరంగ సభ విజయవంతం కావడంపై నారా చంద్రబాబు ట్విట్టర్ ద్వారా స్పందించారు. సభ ద్వారా ప్రజల కోసం పోరాడాలనే సంకల్పం మరింత బలపడిందన్నారు. గతంలో నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే (NDA) భాగస్వామ్యంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు చంద్రబాబు తెలిపారు. ప్రజలంతా కలిసికట్టుగా కృషి చేస్తే తప్పకుండా విజయం సాధిస్తామన్నారు.

Chandrababu React on Prajagalam Sabha success
Chandrababu React on Prajagalam Sabha success

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 18, 2024, 12:25 PM IST

Updated : Mar 18, 2024, 12:45 PM IST

Chandrababu React on Prajagalam Sabha success:నిన్న పల్నాడు జిల్లా బొబ్బనపూడిలో ప్రజాగళం సభ విజయవంతం కావడంపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ (ఎక్స్) ద్వారా స్పందించారు. సభను విజయవంతం చేసినందుకు తెలుగుదేశం, బీజేపీ, జనసేన నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఏపీ భవిష్యత్తు కోసం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రజలంతా సమిష్టిగా కృషిచేయాలని నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ (ఎక్స్ ) ద్వారా పిలుపునిచ్చారు. మూడు పార్టీల కూటమి నిర్వహించిన ప్రజాగళం సభను విజయవంతం చేసినందుకు ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సభ ద్వారా ప్రజల కోసం పోరాడాలనే సంకల్పం మరింత బలపడిందని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం మరింతగా పోరాడనున్నట్లు తెలిపారు. కలిసికట్టుగా కృషి చేస్తే మనం తప్పకుండా విజయం సాధిస్తామని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

కూటమిని 25 సీట్లలో గెలిపించండి: మోదీ గారి నాయకత్వంలో ఎన్డీయే దేశంలో 400 సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిని 25 సీట్లలో గెలిపించి మోదీ గారి సహకారంతో రాష్ట్ర పునర్నిర్మాణం చేసుకోడానికి ప్రజలు సంకల్పించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ అధ్వర్యంలోని ఎన్డీయే (NDA) భాగస్వామ్యంతో గతంలో ఏపీకి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి 11 జాతీయ విద్యాసంస్థలు తీసుకువచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణ చేపట్టినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గతంలోనే సుమారు 72 శాతం పనులను పూర్తి చేసినట్లు చంద్రబాబు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఏపీలో ఎన్డీఏ సభపై ప్రధాని మోదీ ట్వీట్లు - ఏమన్నారంటే?

సమష్టిగా ఆంధ్రప్రదేశ్ ని తిరిగి గాడిలో పెట్టేందుకు అంతా కలిసి పనిచేద్దాం. ప్రజాగళం సభకు హాజరైన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ సభ ద్వారా ప్రజా మద్దతుతో వారి హక్కుల కోసం పోరాడి, రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తును ఇవ్వాలనే సంకల్పం మరింత బలపడింది. మనం కలిసికట్టుగా మనం విజయం సాధిస్తున్నాం. విభజన తర్వాత ఎన్డీయే భాగస్వామ్యంతో ఏపీలో 11 జాతీయ విద్యాసంస్థలని నెలకొల్పాం. మోదీ గారి చేతుల మీదుగా అమరావతి నిర్మాణం తలపెట్టాం. పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తిచేశాం. నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం అధినేత

పరీక్షలు రాసే విద్యార్థులకు చంద్రబాబు శుభాకాంక్షలు: నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో ఆందోళన చెందవద్దని విద్యార్థులకు చంద్రబాబు సూచించారు. ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉండండాలని పేర్కొన్నారు. పరీక్షలు రాసే విద్యార్థులు తమ శక్తి మేరకు ప్రయత్నం చేయాలని సూచించారు. అప్పుడే కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని చంద్రబాబు విద్యార్థులకు సూచించారు.

నేటి నుంచి పదో తరగతి పరీక్షలు - విద్యార్థులకు పలు సూచనలు

Last Updated : Mar 18, 2024, 12:45 PM IST

ABOUT THE AUTHOR

...view details