Chandrababu Naidu Write Letter To EC On Pension : రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. మే నెల ఒకటో తేదీన పెన్షన్ల ఇంటింటి పంపిణీకి అవసరమై చర్యలు చేపట్టాలని లేఖలో డిమాండ్ చేశారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్థాయి ఉద్యోగుల ద్వారా ఇంటివద్దే పెన్షన్ పంపిణీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కేంద్రం ఎన్నికల సంఘాన్ని కోరారు. రాష్ట్రంలో ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి తగు ఏర్పాట్లు చేయాలని లేఖలో పేర్కొన్నారు.
CBN Writes to CEC on distribute Old Age Pensions : ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పెన్షన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్నారు. వాలంటీర్లు లేని రాష్ట్రాల్లో కూడా ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ జరుగుతుందని గతంలో హైకోర్టు కూడా వ్యాఖ్యానించిందని గుర్తుచేశారు. గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందితో ఇంటింటికీ పెన్షన్ అందించడం సాధ్యమవుతుందని సీఎస్ నిర్వహించిన కాన్ఫరెన్స్ లో కలెక్టర్లు ఇదివరకే తెలిపారని చంద్రబాబు వివరించారు. లబ్ధిదారులందరికీ ఇంటి వద్దే పెన్షన్ అందించాలని గతంలో తాము చేసిన విన్నపాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పక్కనబెట్టిందని దుయ్యబట్టారు.
TDP Letter To EC Over Pension Distribution : గత నెలకు సంబంధించిన పెన్షన్ సొమ్ము ఒకటో తేదీన రావాల్సి ఉన్నా మూడవ తేదీ వరకు ప్రభుత్వం విడుదల చేయలేదని మండిపడ్డారు. పింఛన్ల కోసం మూడు రోజుల పాటు సచివాలయాల చుట్టూ తిరిగి ఎండదెబ్బకు 33 మంది వృద్ధులు మృతి చెందారని లేఖలో పేర్కొన్నారు. పెన్షన్ దారుల మరణాలను ప్రభుత్వం రాజకీయ లబ్ధికోసం ప్రతిపక్ష పార్టీలకు ఆపాదిస్తుందని తెలిపారు. మే నెలకు సంబంధించి పెన్షన్ పంపిణీకి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో గతంలో చోటు చేసుకున్న పరిణామాలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.
CBN Complaint to Election Commission :సజావుగా పెన్షన్ల పంపిణీ జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో తీవ్రస్థాయిలో ఉన్న ఉష్ణోగ్రతల కారణంగా సచివాలయాల వద్ద పెన్షన్ దారులు నిరీక్షిస్తే లబ్దిదారుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అకాశం ఉందన్నారు. మానవతా దృక్పథంతో ఆలోచించి లబ్ధిదారుల ఇంటి వద్దకే ఒకటో తేదీన పెన్షన్ పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నందును ఇంటింటికీ పెన్షన్ పంపిణీని రెండు రోజుల్లో పూర్తిచేసే అవకాశం ఉందన్నారు. ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ జరుగుతుందున్న సమాచారాన్ని లబ్ధిదారులకు చేరవేయాలని చంద్రబాబు లేఖలో కోరారు.