ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఓటమిని తట్టుకోలేక వైఎస్సార్సీపీ నేతలు హింసకు పాల్పడే ప్రమాదం ఉంది: చంద్రబాబు - Chandrababu Naidu

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 3, 2024, 8:58 PM IST

Chandrababu instructions to TDP counting agents: కౌంటింగ్‌ కేంద్రాల్లో కూటమి ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. కూటమి ఏజెంట్లతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రతి ఓటూ కీలకమేనని గుర్తుంచుకోవాలన్నారు. లెక్కింపు గురించి ఏదైనా అనుమానం వస్తే వెంటనే రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేయాలని టీడీపీ అధినేత సూచించారు.

Chandrababu
Chandrababu (ETV Bharat)

Chandrababu instructions to TDP counting agents: ప్రజల ఐదేళ్ల కష్టాలకు కొన్ని గంటల్లో అడ్డుకట్ట పడనుందని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తంచేశారు. ఎన్నికల్లో కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఓట్ల లెక్కింపులో ఏ అనుమానం ఉన్నా వెంటనే ఆర్వోకు ఫిర్యాదు చేయాలని చంద్రబాబు నాయుడు సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై రాద్ధాంతం చేయాలనుకున్న వైఎస్సార్సీపీ కి సుప్రీం కోర్టులోనూ మొట్టికాయలు తప్పలేదని ఎద్దేవా చేశారు. ఓటమిని జీర్ణించుకోలేని వైఎస్సార్సీపీ కౌంటింగ్​లో హింసకు పాల్పడేందుకు సిద్ధంగా ఉందని, కూటమి కౌంటింగ్ ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దని, నిబంధనలకు కట్టుబడి ఉండాలన్నారు. కౌంటింగ్ ఏజంట్లు ఎలా వ్యవహరించాలో ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్న చంద్రబాబు, ఏజెంట్లు నిర్ధేశిత సమయానికి కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లాలన్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు, తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగుతుందని, అన్ని రౌండ్లు పూర్తయ్యే వరకు ఏజెంట్లు ఎవరూ బయటకు రావొద్దన్నారు. కంట్రోల్ యూనిట్ నెంబర్ ప్రకారం సీల్ ను ప్రతి ఏజెంట్ సరి చూసుకోవాలని వివరించారు.


ఫుల్ సరుకుతో మందుబాబులు రెడీ - ఈసారి ముందుగానే జాగ్రత్త పడ్డారుగా! - Wine Shops Closed in Andhra Pradesh

ప్రతి ఒక్కరూ 17-సీ ఫాం దగ్గర ఉంచుకుని పోలైన ఓట్లను కౌంటింగ్ లో వచ్చిన ఓట్లను సరి చేసుకోవాలన్నారు. అన్ని రౌండ్లు పూర్తయ్యాక పోలైన ఓట్లకు, కౌంటింగ్ లో వచ్చిన ఓట్లలో తేడాలు ఉంటే వీవీప్యాట్ లు లెక్కిస్తారని పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ కు వెళ్లిన ఏజంట్లకు ఏమాత్రం అనుమానం ఉన్నా ఆర్వోకు అభ్యంతరం తెలపవచ్చునన్నారు. ఆర్వోలకు ఇచ్చిన ఫిర్యాదులపై ఎక్నాలెడ్జ్ మెంట్ తప్పకుండా తీసుకోవాలన్నారు. మనకున్న అభ్యంతరాలపై నిబంధనలు పాటిస్తూనే అధికారులకు ఫిర్యాదు చేయొచ్చునని సూచించారు. డిక్లరేషన్ ఫామ్ తప్పుకుండా తీసుకోవాలన్నారు. అనారోగ్య కారణాలతో ఏజంట్ ఎవరైనా రాలేకపోతే నిబంధనల ప్రకారం కౌంటింగ్ కు ముందే మరొకరిని నియమించుకునే వెసులుబాటు ఉందన్నారు. నిబంధనలు అమలయ్యేలా చూడటంలో ఎవరూ రాజీ పడొద్దని తెలిపారు. ప్రతి ఓటూ కీలకమే అనేది ఏజెంట్లు గుర్తుంచుకుని లెక్కింపు ప్రక్రియలో పాల్గొనాలని వెల్లడించారు.

పోస్టల్ బ్యాలెట్లలోనూ సుప్రీం కోర్టులో మొట్టికాయలు తప్పలేదు. ఓటమిని తట్టుకోలేక వైఎస్సార్సీపీ నేతలు హింసకు పాల్పడే ప్రమాదం ఉంది. కూటమి కౌంటింగ్‌ ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దు. అన్ని రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేవరకు ఏజెంట్లు బయటకు రావొద్దు. కంట్రోల్ యూనిట్ నెంబర్ ప్రకారం సీల్‌ సరి చూసుకోవాలి. పోలైన ఓట్లను, కౌంటింగ్‌లో వచ్చిన ఓట్లను సరిచూసుకోవాలి. చంద్రబాబు, తెలుగుదేశం అధినేత

మంగళగిరి ఎన్టీఆర్ భవన్​కు చంద్రబాబు - సీఎం, సీఎం అంటూ నినాదాలు - Chandrababu visits NTR Bhavan

ABOUT THE AUTHOR

...view details