ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

66 ఏళ్ల వయస్సులోనూ ఫైర్‌ బ్రాండే - ఏ పదవికైనా వన్నెతెచ్చిన వ్యక్తి అయ్యన్న: చంద్రబాబు - Chandrababu Naidu Comments - CHANDRABABU NAIDU COMMENTS

Chandrababu Naidu Comments: 16వ శాసనసభ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. 7 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారని, ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నెతెచ్చిన వ్యక్తి అయ్యన్న అని చంద్రబాబు కొనియాడారు. 66 ఏళ్ల వయస్సు ఉన్నా ఇప్పటికీ ఫైర్‌ బ్రాండే అని పేర్కొన్నారు. అత్యున్నత, గౌరవప్రదమైన సభగా 16వ సభను తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

Chandrababu Naidu Comments
Chandrababu Naidu Comments (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 22, 2024, 12:21 PM IST

Chandrababu Naidu Comments: అయ్యన్నపాత్రుడు ఎప్పటికీ ఫైర్ర్ బ్రాండేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. అంకిత భావం విషయంలో అయ్యన్న కరుడుగట్టిన పసుపు సైనికుడని ఆయన ప్రశంసించారు. పార్టీని కన్నతల్లిగా భావిస్తూ 43 ఏళ్లుగా నిక్కచ్చిగా రాజకీయాలు చేశారన్నారు. మచ్చలేని అయ్యన్నపాత్రుడుపై గత 5 ఏళ్లలో అత్యాచారం సహా పదుల సంఖ్యలో అక్రమ కేసులు పెట్టారన్న చంద్రబాబు, దేనికీ భయపడకుండా ధైర్యంగా పోరాడి ప్రజల్లో గెలిచి అసెంబ్లీకి వచ్చారని తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ముద్ర వేశారు: అత్యంత సీనియర్‌ సభ్యుల్లో అయ్యన్న ఒకరన్న చంద్రబాబు, అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని ఆనాడు ఎన్టీఆర్‌ పిలుపునిచ్చారని, ఎన్టీఆర్‌ పిలుపుతో 25 ఏళ్ల వయస్సులో అయ్యన్న రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేశారు. 7 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారని, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ముద్ర వేశారని తెలిపారు. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నెతెచ్చిన వ్యక్తి అయ్యన్న అని చంద్రబాబు కొనియాడారు.

66 ఏళ్ల వయస్సు ఉన్నా ఇప్పటికీ ఫైర్‌ బ్రాండే:1983 నుంచి ఇప్పటివరకు పది సార్లు పోటీచేశారని, 66 ఏళ్ల వయస్సు ఉన్నా ఇప్పటికీ ఫైర్‌ బ్రాండే అని అన్నారు. నీతి, నిజాయతీ, నిబద్ధతను పుణికిపుచ్చుకొని రాజకీయాలు చేశారన్న చంద్రబాబు, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎనలేని కృషిచేస్తున్న నాయకుడని పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అనేక పోలీసుస్టేషన్లలో కేసులు పెట్టి వేధించారన్నారు. 23 కేసులు పెట్టినా రాజీలేని పోరాటం చేశారన్నారు.

చట్టసభలో చివరి సారి సభాధ్యక్ష పదవి- సభా గౌరవానికి భగం కలగనివ్వబోను: అయ్యన్న పాత్రుడు - Ayyanna Patrudu as Speaker

అసెంబ్లీకి వస్తే చాలా ఇబ్బందిపెట్టారు: చట్టసభకు రావడం అరుదైన గౌరవమన్న చంద్రబాబు, మనందరిపై పవిత్ర బాధ్యత ఉందని గుర్తుంచుకోవాలన్నారు. సమర్థంగా పనిచేస్తే గౌరవం దానంతట అదే వస్తుందని, ఎంతో పవిత్రమైన అసెంబ్లీని గత ప్రభుత్వం దెబ్బతీసిందన్నారు. 23 మంది గెలిచి అసెంబ్లీకి వస్తే చాలా ఇబ్బందిపెట్టారని, తన కుటుంబం గురించి ఇష్టానుసారం మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మైకు ఇవ్వకుండా చేసి అవమానపరిచారని పేర్కొన్నారు.

గౌరవ శాసనసభను గత ప్రభుత్వం అగౌరవ పరిచిందని ఆరోపించారు. బూతులు తిట్టేందుకు, వ్యక్తిత్వ హననం, అవమానాలు, దాడులకు వేదికగా నాటి సభ నిలిచిందని మండిపడ్డారు. తనను, తన కుటుంబసభ్యుల్ని ఎంతో అవమానించినా కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని విమర్శించారు. అందుకే మళ్లీ ముఖ్యమంత్రిగా గౌరవ సభకు వస్తానని శపథం చేసి బయటకు వెళ్లిపోయానని గుర్తుచేశారు. స్పీకర్ కు అభినందన తీర్మానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. నాటి శాసనసభలో ఆడబిడ్డల వ్యక్తిత్వ హననం ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తంచేశారు. సోషల్‌ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టారని, ప్రజలు అంతా గమనించి తనను గౌరవ సభకు పంపారన్నారు.

స్పీకర్‌గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎన్నిక ఏకగ్రీవం - నేడు అసెంబ్లీలో ప్రకటన - ap assembly speaker Ayyanna Patrudu

మళ్లీ జన్మ ఉంటే తెలుగువాడిగానే పుట్టాలి:భవిష్యత్తులో ఏ ఆడబిడ్డకు అవమానం జరగకుండా చూడాలని, అలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా గౌరవ సభ నడుపుకుందామని పిలుపునిచ్చారు. ప్రజలు కూడా మనకు జరిగిన అన్యాయాన్ని గ్రహించి గౌరవ సభకు పంపారని తెలిపారు. వారి నమ్మకాన్ని కాపాడుతూ, ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత సభపై ఉందని అన్నారు. ప్రజలు ఇప్పటికే వైఎస్సార్సీపీని శిక్షించారన్న చంద్రబాబు, ఆ పార్టీని ఇక వెక్కిరించాల్సిన అవసరం మనకు లేదని స్పష్టంచేశారు. తన గౌరవాన్ని కాపాడిన ప్రజానీకానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. మళ్లీ జన్మ ఉంటే తెలుగువాడిగానే పుట్టాలన్న చంద్రబాబు, తెలుగుగడ్డ రుణం తీర్చుకోవాలనేదే తన కోరిక అని అన్నారు.

అనేక పాలసీలు తీసుకొచ్చా: తన జీవితంలో ఎప్పుడూ చూడని సభ 15వ శాసనసభ అన్న చంద్రబాబు, 15వ శాసనసభను కౌరవసభగా మనం భావించామన్నారు. అత్యున్నత, గౌరవప్రదమైన సభగా 16వ సభను మనం తీర్చిదిద్దాలన్న చంద్రబాబు, ప్రజా జీవితాలను మార్చే శక్తి ప్రభుత్వ విధానాలకు ఉందని తెలిపారు. ప్రభుత్వ విధానాలకు రూపకల్పన చేసే సభ ఇది అని, తెలుగుబిడ్డ పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. పీవీ సంస్కరణలను ఆదర్శంగా తీసుకుని అనేక పాలసీలు తీసుకొచ్చానన్నారు.

సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపిన పవన్‌ కల్యాణ్‌ - AP Assembly Sessions 2024

నెగ్గి చూపించిన నాయకుడు పవన్ కల్యాణ్: 2019 ఎన్నికల ఫలితాలపై దేవుడి స్క్రిప్ట్ అంటూ జగన్ ఏవేవో లెక్కలు చెప్పాడని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ఈ ఎన్నికల్లో కూటమికి వచ్చింది 164 సీట్లయితే, 1+6+4 =11 వైఎస్సార్సీపీకి వచ్చిన సీట్లని అన్నారు. అమరావతి రాజధాని రైతుల ఉద్యమం 1631 రోజులు 1+6+3+1 = 11 అని అన్నారు. పవన్ కల్యాణ్​ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమన్నారని చంద్రబాబు గుర్తుచేశారు.

21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లోనూ పవన్ కల్యాణ్, ఆయన అభ్యర్థులు గెలిచి చూపించారని తెలిపారు. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గి చూపించిన నాయకుడు పవన్ కల్యాణ్ అని ప్రశంసించారు. వికసిత్ భారత్ నరేంద్ర మోదీ కల అయితే వికసిత్ ఆంధ్రప్రదేశ్ మనందరి కల కావాలని ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని నిరుపేద రహిత ఆంధ్రప్రదేశ్​గా తీర్చిదిద్దేదుకు అంతా కలసి కట్టుగా కృషి చేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు.

రెండున్నరేళ్ల తర్వాత సగౌరవంగా గౌరవ సభకు సీఎం చంద్రబాబు - cm chandrababu entered to assembly

ABOUT THE AUTHOR

...view details