ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కౌంటింగ్ కేంద్రంలో అలజడి సృష్టిస్తే తక్షణమే అరెస్ట్ : సీఈఓ మీనా - CEO Inspected Vote Counting Center - CEO INSPECTED VOTE COUNTING CENTER

CEO Meena Inspected Vote Counting Center at Krishna University: ఓట్ల లెక్కింపు రోజు కేంద్రాల్లో ఎవరైనా అలజడి సృష్టిస్తే వారిని తక్షణమే అరెస్టు చేస్తామని సీఈఓ మీనా స్పష్టం చేశారు. మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించారు. ఫలితాల రోజు ఎవరూ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని తెలిపారు.

ceo_inspected_vote_counting_center
ceo_inspected_vote_counting_center (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 30, 2024, 4:35 PM IST

CEO Meena Inspected Vote Counting Center at Krishna University:ఓట్ల లెక్కింపు సమయంలో ఎవరైనా కౌంటింగ్ కేంద్రంలో అలజడి సృష్టిస్తే తక్షణమే వారిని అరెస్ట్ చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా (CEO Mukesh Kumar Meena) హెచ్చరించారు. రాజకీయ పార్టీల అభ్యర్ధులు, కౌంటింగ్ ఎజెంట్లు గమనించాలని సూచించారు. మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాలాజీ, జిల్లా పోలీసు అధికారి అద్నాన్ నయీమ్ అస్మితో కలిసి ఆయన పరిశీలించారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు అలాగే కౌంటింగ్ కేంద్రానికి భద్రతను పరిశీలించామని మీనా తెలిపారు.

ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, సీఆర్పీఎఫ్​ దళాలు (CRPF forces) భద్రతను పర్యవేక్షిస్తుంటాయని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ ఉంటుందని అన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరూ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని సూచించారు. గెజిటెడ్ సంతకం సడలింపుపై వచ్చిన ఫిర్యాదుపై స్పష్టత ఇచ్చామని తెలిపారు. అనుమానాలు నివృత్తి చేసేందుకు ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు. లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకు పంపుతామని మీనా హెచ్చరించారు. కౌంటింగ్ రోజున అల్లర్లకు తావు లేకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు సీఈఓ తెలిపారు.

ఫలితాల రోజు ఎవరూ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదు: సీఈఓ మీనా (ETV Bharat)

తాడేపల్లి పీఎస్‌లో సజ్జలపై టీడీపీ నేత దేవినేని ఉమ ఫిర్యాదు - Devineni Uma complaint on Sajjala

ఓట్ల లెక్కింపు సమయంలో ఎవరైనా కౌంటింగ్ కేంద్రంలో అలజడి సృష్టిస్తే తక్షణమే వారిని అరెస్ట్ చేస్తాము. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. రాజకీయ పార్టీల అభ్యర్ధులు, కౌంటింగ్ ఎజెంట్లు గమనించాలి. ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు చేయకూడదు. వాటి వల్ల గొడవలు జరిగే అవకాశం ఉంది. కౌంటింగ్ రోజున అల్లర్లకు తావు లేకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశాము. రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కౌంటింగ్ కేంద్రం వద్ద సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో భద్రత ఉంటుంది.- ముఖేష్ కుమార్ మీనా, సీఈవో

ప్రజారోగ్య పర్యవేక్షణ వ్యవస్థ నిర్వీర్యం- వైఎస్సార్సీపీ పాలనలో అలంకారప్రాయంగా కమాండ్‌ సెంటర్‌ - SANITATION SITUATION IN AP

తాగునీటి సరఫరాలో అధికారుల నిర్లక్ష్యం- ఇంకా ఎంతమందిని బలిగొంటారు?: సీపీఎం - water problem in vijayawada

ABOUT THE AUTHOR

...view details