Central Minister Rajnath Singh criticized CM Jagan: వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్లలో బీజేపీ నిర్వహించిన సమావేశం కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొన్నారు. జగన్ సొంతజిల్లాలో శాంతిభద్రతలు సరిగా లేవని ఆరోపించారు. ఏపీ నుంచి డబుల్ ఇంజిన్ సర్కార్ మొదలవుతోందని ధీమా వ్యక్తం చేశారు.
ఒకే దేశం ఒకే ఎన్నిక మోడీ ప్రభుత్వం లక్ష్యం: ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని కేంద్ర హోం శాఖ మంత్రి రాధా సింగ్ అన్నారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల లో పార్టీ కార్యకర్తల సమావేశంలో రాజ్నాథ్ పాల్గొన్నారు జమ్మలమడుగు అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి, కడప టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. ఏపీ నుంచి డబుల్ ఇంజిన్ సర్కార్ మొదలవుతోందని కేంద్ర మంత్రి అన్నారు. ఏపీ ప్రగతిలో మోడీ పాత్ర కీలకం అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రి పివి నరసింహ రావు కి సైతం భారత రత్న ఇచ్చిన ఘనత మోడీ ప్రభుత్వానికి చెందుతుందని వ్యాఖ్యానించారు. ఒకే దేశం ఒకే ఎన్నిక మోడీ ప్రభుత్వం లక్ష్యం అన్నారు. పదేళ్ల తర్వాత చిన్న పిల్లలకి కూడా గుర్తు లేకుండా పోయే పార్టీ కాంగ్రెస్ అని రాజనాథ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ని దేశంలో లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలదే అన్నారు. ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 25 లక్షల ఇల్లు మంజూరు చేస్తే కేవలం ఇళ్ల స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి సీఎం జగన్ అని విమర్శించారు.