Tourism Hub In West Godavari:ఆధ్యాత్మిక కేంద్రంతోపాటు ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు కనువిందు చేసే సముద్ర అలలు, చల్లటి గాలులు వీచే సరుగుడు తోటలకు నిలయం అంతర్వేది తీరం. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంతోపాటు సాగర సంగమం, దీప స్తంభం, సముద్రం, మడ అడవులు, బోటింగ్ చూపరులను కట్టిపడేస్తాయి. సముద్ర తీర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించాయి.
బందీపూర్ తరహాలో చిత్తూరులో జాతీయ పార్కు - కేంద్రానికి ప్రతిపాదనలు
పర్యాటక మణిహారం:కోనసీమ జిల్లాలో సముద్ర తీర ప్రాంతం అంతర్వేది నుంచి భైరవపాలెం వరకు సుమారు 93 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సముద్ర తీరంలో అంతర్వేది, చింతలమోరి, ఓడలరేవు, వాసాలతిప్ప, ఎస్ యానాం తదితర బీచ్‌లున్నాయి. పర్యాటకంగా అభివృద్ధి చేస్తే మణిహారమే అవుతుందని స్థానికులు, పర్యాటకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిత్యం పర్యాటకులు, భక్తులతో సందడిగా కనిపించే అంతర్వేది బీచ్‌లో మౌలిక సదుపాయాల్లేక సందర్శకులు వచ్చిన వెంటనే వెనుదిరుగుతున్నారు. బస చేయడానికి వసతులను ఏర్పాటు చేస్తే మరింత అభివృద్ధి చెందడమే కాకుండా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఉంటాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.