Cement Factory Accident Treatment Person Has Dead:ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బుధవాడ గ్రామంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రెండో వ్యక్తి మృతి చెందాడు. విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాణావతి స్వామి మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఆవుల వెంకటేష్ మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం సిమెంట్ తయారీలో భాగంగా అత్యధిక ఉష్ణోగ్రత వద్ద ముడి పదార్థాన్ని పౌడర్‌గా మార్చే కిలెన్ విభాగంలో ట్యాంకు పగలడంతో భారీ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
భారతి సిమెంట్ వాహనాలతో అనారోగ్య సమస్యలు - మహిళల ఆందోళన - Protest on Vehicles Dust Problem
ముడి పదార్థాన్ని పంపుతూ వేడి చేసే పైపులైన్ మాదిరిగా ఉండే ట్యాంకు కింది భాగం ఊడిపోయింది. దీంతో 200 డిగ్రీలపైగా వేడితో ఉన్న పొడి కిందకు పడింది. ఇది విధుల్లో ఉన్న కార్మికుల శరీరంపై పడటంతో వారి శరీరమంతా కాలిపోయి తీవ్రంగా గాయపడ్డారు.కర్మాగారంలో బాయిల్ పేలుడుతో చుట్టుపక్కల భారీగా పొగలు వ్యాపించాయి. శబ్దం విన్న వెంటనే బూదవాడ గ్రామానికి చెందిన ప్రజలు హుటాహుటిన కర్మాగారానికి చేరుకున్నారు.