How To Find Cancer :క్యాన్సర్ మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల బారిన పడుతున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. జీవన శైలిలో మార్పులు, ఆహారంలో పోషకాల లేమి, వాతావరణ కాలుష్యం వంటి కారణాలతో అనేక మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అందుకే ప్రభుత్వం మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. నవంబర్‌లో అసాంక్రమిక వ్యాధుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జాతీయ స్థాయి కార్యక్రమానికి (APNCD) శ్రీకారం చుట్టింది.
క్యాన్సర్‌పై నిర్లక్ష్యం, అవగాహన లేమి :తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మారుమూల గ్రామాల్లో స్వీకార్ వైద్యులు, స్విమ్స్ ఏర్పాటు చేసిన పింక్ బస్సులు ఉచితంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. స్వీకార్ 48,000 పరీక్షలు నిర్వహించారు. స్విమ్స్ ఈ ఏడాదిలోనే 9,584 మందిని పరీక్షించింది. అనుమానితులను గుర్తించి తదుపరి చికిత్సలు అందిస్తున్నారు. కేసులు తక్కువ నమోదు అయిన ప్రజల్లో క్యాన్సర్‌పై నిర్లక్ష్యం, అవగాహన లేమి స్పష్టంగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోది.
ప్రభుత్వ చర్యలు ఇలా :ఏపీఎన్‌సీడీ సర్వే కోసం జిల్లాలో 9 వందల మందికి పైగా మెడికల్ అధికారులు, సీహెచ్‌వోలు, సిబ్బందికి రెండు నెలల కిందటే శిక్షణను ఇచ్చారు. వీరు వారానికి 45 మందిని సర్వే చేయనున్నారు. ఆ వివరాలు 'ఈ-బ్యాక్' అనే ఆన్‌లైన్ సైట్‌లో పొందుపరచనున్నారు. షుగర్, బీపీ, క్యాన్సర్ వంటి వాటి గురించి ముందుస్తుగా ఏఎన్‌ఎంలు అవగాహన కల్పిస్తారు. దానితో పాటు మెడికల్ అధికారులు, సీహెచ్‌వోలు కలిసి ఇంటింటి సర్వే నిర్వహిస్తారు.
ఛాతీ అందంగా, ఆరోగ్యంగా ఉండేందుకు - ఈ జాగ్రత్తలు మేలంటున్న నిపుణులు!