Canada Girl Love Marriage to Young Man from Konaseema District:ప్రేమకు రంగు, భాష, దేశంతో సంబంధం లేదని నిరూపించింది ఓ జంట. దేశాలతో సంబంధం లేకుంజా ప్రేమించుకున్న ఈ ప్రేమ జంట ప్రస్తుతం పెళ్లితో ఒక్కటయ్యారు.కెనడా అమ్మాయి బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన అబ్బాయి ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని అమలాపురం మండలం ఈద్రపల్లికి చెందిన మనోజ్ కుమార్ కెనడా దేశస్తులైన ట్రేసి రో చే డాన్‌తో ప్రేమలో పడ్డాడు. వీరు 7 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. మనోజ్ కుమార్ ప్రస్తుతం కెనడాలో బ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు.
మనోజ్ కుమార్‌కి, అతని ప్రేయసికి కెన్యాలో నిశ్చితార్థం జరగగా కెనడా సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో హిందూ సాంప్రదాయంగా వివాహం చేసుకునేందుకు 2 రోజుల క్రితం ఈదరపల్లిలోని స్వగృహానికి వచ్చారు. పెళ్లి కుమార్తెను చేసే వేడుకతో పాటు హల్దీ వేడుకను ఈద్రపల్లిలో సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ వారంలో మలికిపురం మండలం దిండిలో వివాహం చేసుకుంటామని పెళ్లి కుమారుడు మనోజ్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 8న ఈ కొత్త జంట రిసెప్షన్ జరుపుకోనున్నారు. కెనడా దేశస్తులు ఈదరపల్లిలో కనిపించడంతో గ్రామస్థులు ఆసక్తిగా చూశారు.