Huge Chits Scam In Gooty :20 ఏళ్లుగా అదే ఊరిలో ఎంతో నమ్మకంగా ఉన్నాడు. వ్యాపారం చేస్తూ అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. అదే సమయంలో చీటీల వ్యాపారం కూడా మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు అనుకున్న సమయానికే డబ్బులు ఇచ్చాడు. అంతేకాదు కొంతమందికి ఇంటికి మరీ తెచ్చి డబ్బులిచ్చేవాడు. కానీ ఏమైందో తెలియదు కొంతమందికి డబ్బులు అడిగిన వారికి ప్రాంసరీ నోట్లు ఇచ్చాడు. సరేలే ఇస్తాడులే అని కొన్ని రోజులు చూశారు. కానీ ఆ తర్వాత జరిగిన విషయం తెలుసుకుని లబోదిబోమంటున్నారు.
చీటీల పేరుతో రెండు కోట్లకుపైగా టోకరా వేశాడు ఓ ప్రబుద్ధుడు. తాము మోసపోయినట్లు ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ అనంతపురం జిల్లా గుత్తి పోలీసులను ఆశ్రయించారు. జిల్లాలోని గుత్తి పట్టణంలోని బండగెరికి చెందిన బాలకృష్ణ అనే వ్యక్తి గత 20 ఏళ్లుగా గుత్తి పట్టణంలో నివాసం ఉంటున్నాడు. పట్టణంలోనే హోల్ సేల్ వ్యాపారాన్ని నిర్వహిస్తూ చీటీలు కట్టించుకునేవాడు. ఇన్నాళ్లు నమ్మకంగా ఉండడంతో చాలా మంది దగ్గర చీటీల పేరుతో డబ్బులు వసూలు చేసి లక్షల్లో టర్నోవర్ చేసేవాడు.
గత పది రోజుల నుంచి బాలకృష్ణ కనిపించకపోవడంతో బాధితులు అయోమయంలో పడ్డారు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దీంతో అనుమానం వచ్చిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. గత పదేళ్లు బాలకృష్ణ వద్ద చీటీలను వేస్తున్నామని పోలీసులకు తెలిపారు. చీటీ డబ్బులు అడిగిన వారికి ప్రాంసరీ నోట్లను రాసిచ్చాడని, అదే గత నెల 29న వారణాసి వెళ్తున్నామని చెప్పి కుటుంబ సభ్యులతో బయలుదేరిన వ్యక్తి తిరిగి ఇప్పటి వరకు రాలేక రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదు చేశారు.