Hala Startup in Hyderabad : ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయాలని కొందరు అనుకుంటే సొంతంగా స్టార్టప్ ప్రారంభించి తమతో పాటు పది మందికి ఉపాధి కల్పించాలని మరికొందరు భావిస్తున్నారు. రెండో కోవకే చెందుతారీ స్నేహితులు. ఈవీల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో హలా మోబిలీటీ అనే స్టార్టప్ ప్రారంభించారు. ఈ కామర్స్, గిగ్ వర్కర్లకు యాప్ ద్వారా సేవలందిండమేకాకా బ్యాటరీలు, డ్రైవర్లనూ అందిస్తున్నారు. మరిన్ని విశేషాలు హలా మోబిలిటీ ఫౌండర్స్ మాటల్లోనే విందాం.
మా టీంతోనే సాధ్యం : గిగ్ వర్కర్లను అందరు తేలిగ్గా తీసుకుంటారని, దాని గురించే ఆలోచించి హలా లీజింగ్ విధానాన్ని ప్రారంభించిందన్నారు. డెలివరీ బాయ్స్ రోజు మొత్తం పనిచేసి కనీసం 48 శాతమైన ఆదాయాన్ని ఇంటికి తీసుకువెళ్లాలి అనే ఆలోచనతో స్టార్ట్ చేయడం జరిగిందని వ్యవస్థాపకులు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ హలాను ప్రారంభించినప్పటి నుంచి టీం అంతా కష్టపడి పని చేయడం వల్లే మంచి విజయాన్ని అందుకుందని మరో ఫౌండర్ స్నేహిత్ రెడ్డి వెల్లడించారు.