తెలంగాణ

telangana

ETV Bharat / state

పసలేని, దిశలేని, దండగమారి బడ్జెట్ - ప్రభుత్వ పద్దుపై కేటీఆర్ ట్వీట్ - KTR tweet on state budget 2024

KTR Tweet on State Budget 2024 : రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌ 2024-25పై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను పట్టించుకోని కోతల, ఎగవేతల బడ్జెట్ అని ఆయన విమర్శించారు. వాగ్దానాలను గాలికొదిలిసి, డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసిన దోకేబాజ్ బడ్జెట్ అని మండిపడ్డారు.

KTR slams Congress on State Budget 2024-25
KTR Tweet on State Budget 2024 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 25, 2024, 6:59 PM IST

Updated : Jul 25, 2024, 7:11 PM IST

KTR slams Congress on State Budget 2024-25 :ఆర్థిక సంవత్సరానికి ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్టెట్‌పై కేటీఆర్ "ఎక్స్‌" వేదికగా ఘాటుగా స్పందించారు. గ్యారెంటీలను గంగలో కలిపేసిన కోతల, ఎగవేతల బడ్జెట్ అని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను పట్టించుకోని ఆంక్షల పద్దని ఆయన దుయ్యబట్టారు. వాగ్దానాలను గాలికొదిలిన వంచనల బడ్జెట్, డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసిన దోకేబాజ్ బడ్జెట్ అని ఆయన వ్యాఖ్యానించారు.

కుటుంబ సమేతంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు - KTR Birthday Celebrations

విధానం లేదు, విషయం లేదు, విజన్ లేదు. పేర్ల మార్పులతో ఏమార్చిన డొల్ల బడ్జెట్! అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో రైతులకు కత్తిరింపులు, అన్నదాతలకు సున్నం పెట్టారంటూ ఆయన ఆక్షేపించారు. ఆడబిడ్డలకు అన్యాయం, మహాలక్ష్ములకు మహామోసం. అవ్వా,తాతలకు, దివ్యాంగులకు, నిరుపేదలకు, నిస్సహాయులకు మొండిచేయి చూపారంటూ ఎద్దేవా చేశారు.

పెన్షన్ల పెంపు మాటెత్తలేదు, దళితులకు దగా, గిరిజనులకు మోసం అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. అంబేడ్కర్ అభయహస్తం ఊసులేదు, శూన్యహస్తమే మిగిలిందని, బడుగు బలహీన వర్గాలకు భరోసాలేదని వృత్తి కులాలపై కత్తికట్టారని ఆరోపించారు. మైనార్టీలకు ఇచ్చిన మాటలన్నీ నీటి మూటలయ్యాయని, నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని, 4 వేల రూపాయల భృతి జాడా పత్తా లేదంటూ సూటిగా ప్రశ్నించారు.

చివరకు విద్యార్థులపై కూడా వివక్ష చూపారని, 5 లక్షల రూపాయల భరోసా కార్డు ముచ్చటే లేదని కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. హైదరాబాద్ అభివృధిపై శ్రద్ధలేదని, మహానగర మౌలిక వసతులకు నిధుల్లేవని తూర్పారబట్టారు. నేతన్నకు చేయూత లేదని, ఆటో అన్నలకు అండదండ లేదన్నారు. ఆత్మహత్యపాలైన కుటుంబాలకు ఆదుకోవాలన్న మానవీయ కోణమే కనిపించ లేదన్నారు. మొత్తంగా పసలేని దిశలేని, దండగమారి బడ్జెట్ అని కేటీఆర్ మండిపడ్డారు.

పిస్తాహౌస్‌లో భోజనం.. మేడిగడ్డ సందర్శనకు వెళ్లే మార్గంలో మేడ్చల్ జిల్లా అలియాబాద్ చౌరస్తాలోని పిస్తాహౌస్‌లో కేటీఆర్, ఎమ్మెల్యేల బృందం భోజనం చేశారు. అనంతరం బీఆర్‌ఎస్‌ నాయకులు, హోటల్ సిబ్బంది సెల్ఫీ తీసుకున్నారు. నేతల రాకతో అక్కడి వాతావరణమంతా సందడిగా మారింది. అనంతరం కేటీఆర్​ బృందం అక్కడి నుంచి కాళేశ్వరానికి పయనమైంది.

హైదరాబాద్‌లో పారిశుద్ధ్య నిర్వహణ పడకేసింది - ఎక్కడ చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి: కేటీఆర్ - KTR Reacts On HYD Sanitation

సీఎం రేవంత్​ VS కేటీఆర్ - అసెంబ్లీ వేదికగా మాటల యుద్ధం - telangana assembly meetings 2024

Last Updated : Jul 25, 2024, 7:11 PM IST

ABOUT THE AUTHOR

...view details