తెలంగాణ

telangana

ETV Bharat / state

కమలం గూటికి చేరిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్

BRS MP BB Patil Joined BJP : బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ బీఆర్ఎస్‌ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్‌ ఛుగ్ సమక్షంలో బీజేపీలోకి చేరారు.

BRS MP BB Patil
BRS MP BB Patil Joined BJP

By ETV Bharat Telangana Team

Published : Mar 1, 2024, 4:25 PM IST

Updated : Mar 1, 2024, 7:15 PM IST

BRS MP BB Patil Joined BJP : రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్‌ఎస్‌(BRS) పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత, నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు బీఆర్‌ఎస్‌ను వీడగా, జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ బీఆర్ఎస్‌ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపారు. ఇవాళ దిల్లీలో బీజేపీ రాష్ట్రవ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్‌ ఛుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్స్‌ కేంద్రసహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

"మోదీ పదేళ్ల ప్రగతిని చూసి బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. బీబీ పాటిల్‌కి(BRS MP BB Patil) బీజేపీలోకి స్వాగతం. గత మూడేళ్లలో కుటుంబ, అవినీతి రాజకీయాలు నచ్చని వాళ్లు 60 పైగా నేతలు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. తెలంగాణ అభివృద్ధి కోరుకునేవారు బీజేపీలో చేరుతున్నారు. బీఆర్ఎస్ పని అయిపోయింది. తండ్రి, కొడుకు, కూతురు మాత్రమే పార్టీలో మిగిలారు. మిగిలిన వారు కుటుంబ సభ్యులు, ముందు వెనుక నడిచే వాళ్లు మాత్రమే. తెలంగాణ, బంగారు తెలంగాణగా కావాలనుకునేవారు బీజేపీలో ఉన్నారు. అసత్య హామీలను కాంగ్రెస్ ఇచ్చింది. తెలంగాణలో మూడు నెలల్లో ప్రభుత్వ వ్యతిరేకత మొదలైంది. ఒక్క హామీ కూడా రేవంత్ నెరవేర్చలేదు. మధ్యప్రదేశ్ వచ్చి చూడాలి మోదీ గ్యారంటీలు ఎలా అమలవుతున్నాయనేది. బీఆర్ఎస్ పార్టీ పేరును బీబీబీ(బాప్, బేటా, భేటీ) గా మార్చుకోవాలి". - తరుణ్ చుగ్‌, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు

కమలం గూటికి చేరిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్

BJP Laxman Fires on BRS : తెలంగాణలో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు అవుతోందని రాజ్యసభ సభ్యుడు కే. లక్ష్మణ్‌ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ముగిసిన అధ్యాయమని, గడిచిన చరిత్ర అని దుయ్యబట్టారు. తెలంగాణలో దళిత, లింగాయత్‌ నాయకులు బీజేపీలో చేరారని, బీజీపీకి పెరుగుతున్న ఆదరణను ఓర్చుకోలేక కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. మేడిగడ్డ, కాళేశ్వరంపై దర్యాప్తునకు ఆదేశించకుండా కాంగ్రెస్ ఆలస్యం చేస్తోందని, గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందిని మండిపడ్డారు.

బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌ - బీజేపీలో చేరిన నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు

మోదీ గ్యారెంటీ అంటే అభివృద్ధి, ప్రజల నమ్మకం, విశ్వాసం అని లక్ష్మణ్‌ పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుంచి అనేక మంది బీజేపీ వైపు చూస్తున్నారని, తెలంగాణలో అత్యధిక స్థానాలు బీజేపీ గెలుస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం తెలంగాణలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులను అధిష్ఠానమే ఎంపిక చేస్తుందన్నారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోందని, సామాజిక కోణాలు గెలుపు అవకాశాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. దిల్లీలో లేని కాంగ్రెస్ తెలంగాణలో అవసరం లేదని, బీఆర్ఎస్ నేతల ప్రాజెక్టుల పర్యటన ఒక డ్రామా అని మండిపడ్డారు.

బీఆర్ఎస్​కు బిగ్ షాక్ - కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ వెంకటేశ్‌ నేత

కాంగ్రెస్ కండువా కప్పుకున్న​ పట్నం సునీత మహేందర్ రెడ్డి, బొంతు రామ్మోహన్

Last Updated : Mar 1, 2024, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details