ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట - మధ్యంతర బెయిల్​ను నిరాకరించిన కోర్టు - MLC Kavitha interim Bail Denied - MLC KAVITHA INTERIM BAIL DENIED

BRS MLC Kavitha Interim Bail Petition Verdict : దిల్లీ లిక్కర్ స్కామ్​లో అరెస్టయి జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట దక్కలేదు. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరిస్తూ బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చింది. తన కుమారుడి పరీక్షల దృష్ట్యా బెయిల్‌ ఇవ్వాలని కవిత పిటిషన్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే.

kavitha_bail
kavitha_bail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 8, 2024, 11:42 AM IST

BRS MLC Kavitha Interim Bail Petition Verdict :దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురైంది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఈ నెల 16వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్​లో పేర్కొన్న విషయం తెలిసిందే.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఏప్రిల్‌ 4న ఉత్తర్వులు రిజర్వ్‌ చేసి ఇవాళ తీర్పు వెలువరించింది. మరోవైపు కవితకు మధ్యంతర బెయిల్‌ను ఈడీ (MLC Kavitha ED Arrest) వ్యతిరేకిస్తోంది. ఆమెకు బెయిల్‌ మంజూరు చేస్తే దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని కోర్టుకు తెలిపింది. సాక్ష్యాలు, ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని వివరించింది. ఇప్పటికే అప్రూవర్‌గా మారిన కొందిరిని ఆమె బెదిరింపులకు గురి చేశారని, అందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని వాదనల సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేయాలని ఈడీ కోర్టును కోరింది.

ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సీబీఐకు అనుమతి - Delhi Liquor Case

ED Arguments On MLC Kavitha Bail Petition in Court :ఈడీ కోర్టుకు కవిత గురించి ప్రస్తావిస్తూ దిల్లీ మద్యం కుంభకోణానికి (Delh Liquor Policy Scam) కవితే ప్రణాళిక రచించారన్న ఈడీ, ఆమె తన ఫోన్ డేటాను డిలీట్ చేశారని కోర్టుకు వివరించింది. దర్యాప్తులో అడిగిన ప్రశ్నలకు కవిత సమాధానం ఇవ్వలేదన్న ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ అధికారులు, ఆమె 10 ఫోన్లు ఇచ్చినా, అన్నీ ఫార్మాట్ చేసే ఇచ్చారని, నోటీసులు ఇచ్చిన తర్వాత 4 ఫోన్లను ఫార్మాట్ చేశారని తెలిపింది. ఈ కేసులోని నిందితులు వందల డిజిటల్ డివైజ్‌లను ధ్వంసం చేశారని కోర్టుకు ఈడీ వెల్లడించింది.

అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దు చేయాలని మీరెందుకు కోరలేదు? - సీబీఐని సూటిగా ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు - Avinash Reddy Bail Cancel Petition

MLC Kavitha Petition On Regular Bail :మరోవైపు కవిత దాఖలు చేసిన సాధారణ బెయిల్‌ పిటిషన్‌పై రౌస్‌ అవెన్యూ సీబీఐ కోర్టు ఈ నెల 20వ తేదీన విచారణ చేపట్టనుంది. దిల్లీ మద్యం కేసులో ఈడీ మార్చి 15న ఆమెను అరెస్టు చేసింది. మార్చి 26వ తేదీ నుంచి ఆమె తిహాడ్‌ జైలులో జ్యూడిషియల్‌ కస్ట్‌డీలో ఉన్నారు. మంగళవారంతో జ్యుడీషియల్‌ కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆమెను రేపు మరోసారి కోర్టు ఎదుట హాజరు పరిచే అవకాశముంది. మరోవైపు కవితను ప్రశ్నించేందుకు ఇప్పటికే సీబీఐ (CBI To Investigate Kavitha) కోర్టు అనుమతి పొందిన విషయం తెలిసిందే.

విశాఖకు కంటెయినర్‌లో వచ్చింది డ్రగ్సే - సీబీఐ నివేదికలో వెల్లడి - Visakhapatnam Drugs Case

ABOUT THE AUTHOR

...view details